రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పోలీసు సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు

Mounikadesk

పోలీసు సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు

- మాథ్స్, ఇంగ్లీషు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా వెల్లడించిన జిల్లా ఎస్పీ

- ఉపాధ్యాయ ఉద్యోగాలతోపాటు కంప్యూటరు ఆపరేటర్ మరియు గార్డనరును నియమించేందుకు చర్యలు

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎఆర్ పోలీసు లైన్స్ నడపబడుచున్న పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్ జూన్ 25న తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు తమ విద్యార్హతలతో పాటు, ఖచ్చితంగా ఆంగ్లంలో విద్యా భోదన చేయగలిగిన సామర్థ్యం ఉండాలన్నారు. ఉద్యోగ ఖాళీలు, విద్యా అర్హత వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.


1. ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయ ఉద్యోగం - ఖాళీ - 1:

ప్రీ ప్రైమరీ నుండి యు.కే.జి. విద్యార్థులకు ఆంగ్లంలో భోదించగలగాలి. డి.ఈడి. లేదా బి.ఈడి. విద్యార్హతతోపాటు కంప్యూటరు పరిజ్ఞానం కలిగి ఉండాలి.

2. 2వ తరగతి కొరకు సింగిల్ మదర్ టీచర్ ఉద్యోగం - ఖాళీ - 1:

2వ తరగతి విద్యార్ధులకు సింగిల్ మదర్ టీచరుగా పని చేయుటకు డి. ఈడి. లేదా బి.ఈడి. అర్హతలతోపాటు ఆంగ్లంలో అన్ని సబ్జెక్టులను భోదించగలగాలి.

3. 3 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు సబ్జెక్టును భోదించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం - ఖాళీ - 1:

3 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు సబ్జెక్టును భోదించేందుకు డి.ఈడి. లేదా బి.ఈడి. విద్యార్హత కలిగి ఉండాలి.

4. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు గణితంను భోదించేందుకు ఉపాధ్యాయ ఉద్యోగం - ఖాళీ - 1:

6 నుండి 10వ తరగతి విద్యార్థులకు గణితంను ఆంగ్లంలో భోదించగలిగి, బి.ఈడి. విద్యార్హత కలిగి ఉండాలి.

5. కంప్యూటరు ఆపరేటరు ఉద్యోగం - ఖాళీ - 1:

కంప్యూటరు ఆపరేటరుగా పని చేయుటకు బి.ఎస్సీ లేదాబి. కాం లేదా ఇతర కంప్యూటరు పరిజ్ఞానం కలిగిన డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్సులను అర్హతగా కలిగి ఉండాలి.

6. తోటమాలి - ఖాళీ - 1:

పాఠశాలలో తోటమాలిగా పని చేయుటకు ఆసక్తి కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పైన తెలిపిన ఉద్యోగాలను భర్తీ కొరకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 తేదిన ఉదయం 10గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీసు క్వార్టర్సు సమీపం నందుగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాల నందు నిర్వహించే ఇంటర్వ్యూ మరియు డెమో క్లాసులకు నేరుగా హాజరుకావచ్చునన్నారు. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల నివృత్తి కోసం స్కూల్ ఆఫీసు నంబర్లు - 9441022874, 6305883484 లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్ - 9121109485, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ - 9121109484 ని సంప్రదించ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఒక ప్రకనలో తెలిపారు.

Comments

-Advertisement-