తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదో ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి
తల్లికి వందనం డబ్బులు పడ్డాయో లేదో ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి
67 లక్షల మంది ఖాతాల్లో తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. కొందరి పేరెంట్స్ ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ. 13,000 చొప్పున జమ కాగా, మరికొందరికి జమ కాలేదు. మరోవైపు తల్లికి వందనం పథకం డబ్బులు జమ అయ్యాయా?.. లేదా? స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెబ్‌సైట్ అందుబాటులో ఉంచింది.
• ఈ కింది వెబ్‌సైట్‌లోకి వెళ్లి పథకం అనే ఆప్షన్ దగ్గర తల్లికి వందనం సెలక్ట్ చేసుకోవాలి.
• 2025-26 సంవత్సరాన్ని సెలక్ట్ చేయాలి.
• ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
• తర్వాత క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
• ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
• ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
స్టేటస్ చెక్ చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మన మిత్ర వాట్సాప్ ద్వారా..
వాట్సాప్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 నంబర్‌కు Hi మెసేజ్ చేయగానే అక్కడ సేవలన్నీ వస్తాయి.. వాటిలో ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటే తల్లికి వందనం స్టేటస్ చెక్ ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం జాబితాలు..
తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురించామని పాఠశాల విద్యాశాఖ శనివారం తెలిపింది. అర్హులకు సంబంధించిన నగదును వారి తల్లులకు విడుదల చేశామని వెల్లడించింది. "అనర్హత పొందిన లబ్దిదారులు తమ వివరాలతో గ్రామ సచివాలయ శాఖ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకో వాలని ఇప్పటికే తెలియజేశాం. దరఖాస్తుల ఫిర్యాదులను పరిశీలించి, వారు వాస్తవంగా అర్హత కలిగి ఉంటే ఆర్ధిక సహాయాన్ని అందిస్తాం. తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించి నగదును సంబంధిత జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నాం. క్షేత్రస్థాయి పరిశీలన చేశాక వారికి కూడా కలెక్టర్ ద్వారా తల్లికి వందనం అందుతుంది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన తల్లుల జాబితా పునఃపరిశీలించాక వారికి తల్లికి వందనం నగదు జమ చేయడం జరుగుతుంది" అని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.