రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సెప్టెబంర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

సెప్టెబంర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

తిరుమల, 2025, జూన్ 16: సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను జూన్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

21న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూన్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

25న శ్రీవారి సేవా ఆగస్టు నెల కోటా విడుదల

శ్రీవారి సేవ(తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.

Comments

-Advertisement-