మండల స్థాయి పీజిఆర్ఎస్ కు నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలి
మండల స్థాయి పీజిఆర్ఎస్ కు నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలి
- ప్రభుత్వ ఆస్తులు,శాంతి భద్రతల పరిరక్షణలో మెజిస్టీరియల్ అధికారాలను ఉపయోగించాలి
- ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి
- తహసిల్దార్లు మంగళవారం నుండి శుక్రవారం వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
- రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మి
తిరుపతి, జూన్,26:
మండల స్థాయి పీజిఆర్ఎస్ కు నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తో కలిసి పిజిఆర్ఎస్, 22ఏ,హౌసింగ్ ఫర్ ఆల్, జీవో నెంబర్ 30,రీసర్వే, తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై మండల,డివిజన్, జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మి రెవెన్యూ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించే పిజిఆర్ఎస్ కు నోడల్ అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. వారు ప్రతి సోమవారం మండలానికి వెళ్లి అక్కడ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. సోమవారం మధ్యాహ్నం సంబంధిత తహసీల్దారులు వారి సిబ్బందితో కూర్చుని ఆరోజు వచ్చిన పిటిషన్లలో ఆర్ ఐ, మండల సర్వేయర్లకు సంబంధించిన పిటిషన్లను అందజేయాలన్నారు. వారు ఆ పిటిషన్ల పై వారం లోపు నివేదికలు ఇవ్వాలన్నారు. ప్రతి సోమవారం జరిగే సమావేశానికి సంబంధించిన మినిట్స్ రికార్డ్ చేసుకుని ఉంచుకోవాలని, ఒక ప్రతిని ఆర్డీవోకి పంపాలన్నారు. అనంతరం వారి కార్యాలయాలకు తనిఖీ నిమిత్తం విచ్చేసే ఉన్నతాధికారులకు ఆ మినిట్స్ ప్రతులను చూపించాలన్నారు.
జిల్లా కలెక్టర్ నుండి థర్డ్ పార్టీతో ఆడిట్ చేసి ఎండార్స్ మెంట్లో గుర్తించిన తప్పిదాలను సరిచేయాలని తహసిల్దార్లకు పంపడం జరుగుతుందన్నారు.ఆ తప్పిదాలను మండల తహసీల్దారులు సరిచేయాలని, అదే తప్పు మరొక మారు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. అలా కాకుండా మరలా అలాంటి తప్పులే చేస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఈ అంశంలో ఇప్పటికే ఆరు నెలల సమయం ఇచ్చామని, పిజిఆర్ఎస్ సిస్టంలో మోడిఫికేషన్ చేయడం జరిగిందని, రాష్ట్రస్థాయి నుండి కొన్ని సూచనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. మరొక నెలలోపు పిజిఆర్ అంశంపై అందరూఅవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. తప్పులు చేస్తే ఇకపై సహించేది లేదని అలాంటి తహసీల్దారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి వెనుకాడమన్నారు. మ్యుటేషన్లకు సంబంధించిన ప్రక్రియ, కుల ధ్రువీకరణ జారీ లాంటి చట్టపరమైన అంశాల్లో ఎలాంటి తప్పిదాలకు తావివ్వరాదన్నారు.వెబ్ ల్యాండ్ సంబంధించి ఏ ఎంట్రీ అయినా నమోదు చేసేటప్పుడు వీఆర్వో అప్లోడ్ చేసే డాక్యుమెంట్ను తప్పనిసరిగా పరిశీలించాలని, ఎటువంటి పరిస్థితుల్లో పరిశీలించకుండా సంతకం చేయరాదని హెచ్చరించారు. అలాగే వారు విచారణకు సంబంధం లేని వాటిని ఏదైనా అప్లోడ్ చేస్తున్నారా, అలాంటివి ఏమైనా గుర్తించారా అని అధికారులను ప్రశ్నించారు.
తహసిల్దారుగా మ్యుటేషన్ ప్రక్రియకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఈ సేవా ద్వారా చేయాలని, ఆ తర్వాత వీఆర్వో నివేదిక పరిశీలించాలని అనంతరం క్లిక్ చేసి ఓపెన్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేశారా?లేదా?చూడాలన్నారు. అందులో ఆర్ఐ ఏమి సిఫారసు చేశారో పరిశీలించి ఆ తర్వాత సంబంధిత తహసిల్దార్లు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఆ తర్వాత వాటిని అప్లోడ్ చేయాలన్నారు. రెండు ,మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన టెంప్లేట్లను పంపడం జరుగుతుందన్నారు.వాటిని రెవెన్యూ అధికారులకు పంపుతామని అందులో పార్టిషన్, సేల్ లకు సంబంధించి ఆటోమేటిక్ గా ఉత్తర్వులు వస్తాయన్నారు. కేవలం స్పీకింగ్ పార్ట్ మాత్రమే అందులో టైప్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మీరు చట్టపరమైన బాధ్యతను నిర్వహిస్తున్నారన్న అంశాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. చట్టంలో లేనిది చేస్తే శిక్షలు ఉంటాయని కూడా గుర్తించాలన్నారు. కోర్టు, ఎంక్వయిరీలకు సంబంధించి రెవెన్యూ అధికారులు క్వాసీ జ్యూడిషియర్ గా వ్యవహరిస్తున్నారని గుర్తెరగాలన్నారు. ప్రైమరీ అథారిటీగా తహసిల్దార్ మొదలుకొని అప్పిలేట్ అథారిటీ ఆర్డీవో, జేసీ, కలెక్టర్ రివిజన్ అథారిటీలుగా వ్యవహరిస్తారన్న అంశాన్ని మీ మస్థిష్కంలో ఉంచుకోవాలన్నారు. చట్టపరంగా మీకు అందించిన డిజిటల్ కీని ఇతరులకు ఇవ్వడం జరుగుతోందని గుర్తించడం జరిగిందని,ఇలా ఎప్పుడు చేయరాదని ఆమె హెచ్చరించారు.పిజిఆర్ఎస్ పిటిషన్లను సమీక్షించుకొని కిందిస్థాయి సిబ్బంది ఇచ్చేఎండార్స్మెంట్లను పరిశీలించి అనంతరం మాత్రమే వాటిని అప్లోడ్ చేయాలని, అలా చేసినప్పుడు థర్డ్ పార్టీ ఆడిట్ లో ఆ తప్పిదాలు రాకుండా ఉంటాయన్నారు.
అలాగే హౌసింగ్ ఫర్ అల్ అంశంలో ఇదివరకే సూచనలు జారీ చేశామన్నారు.ఎంఐఎస్ సపోర్ట్ సిస్టం ఇస్తామని, తొలి దశలో కేటగిరి 1 లో వచ్చిన దరఖాస్తులలో ప్రభుత్వ భూములు రెడీగా ఉన్నవి పేర్కొనాలని, పార్ట్ పార్ట్ గా ఉన్న వాటినితదుపరి చేయాలని, భూసేకరణ చేయాల్సినవి కేటగిరి వారీగా విభజించుకోవాల న్నారు. ఆర్ డి వో లు, సబ్ కలెక్టర్లు ఎక్కడ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయో ఆ గ్రామాల్లోకి వెళ్లి పరిశీలించాలన్నారు. ఆ తర్వాత ఇంటి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంలో ఆగస్టు 15 లోపు పట్టాలు ఇచ్చేలా జిల్లాలోని 34 మండలాల్లో కనీసం 10 నుంచి 16 మండలాల్లో కొన్ని గ్రామాల్లో నైనా ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 30 కి సంబంధించి కూడా ఇదివరకే జారీ చేసిన సూచనలు వర్తిస్తాయన్నారు. రెగ్యులరైజేషన్ కు సంబంధించి ప్రతి మంగళవారం నుండి శుక్రవారం వరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలన్నారు. సోమవారం పీజిఆర్ఎస్ ను నిర్వహించడం, శనివారం కోర్టు అంశాలను చేపట్టడం చేయాలన్నారు. ఆక్రమణలు, రెండు పార్టీల మధ్య తగాదాలు తదితర అంశాల్లో సంబంధిత తహసిల్దార్లు 145 సి ఆర్ పి సి సెక్షన్ ను అమలు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పోలీస్ శాఖ వారు 70% భూ తగాదాలవల్ల శాంతిభద్రతలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారన్నారు.ఈ అంశాలలో రెవెన్యూ అధికారులు వారి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ ను ఉపయోగించి ప్రభుత్వ ఆస్తులను ,అలాగే శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు. అలాగే రెవెన్యూ కార్యాలయాలకు విచ్చేసి ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా వినాలని, నాణ్యతతో వారి సమస్యలను పరిష్కరించినప్పుడు రెవెన్యూ శాఖకు మంచి పేరు వస్తుందన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు.*
*జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్. వెంకటేశ్వర్ జిల్లాలో నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ ను ఏ విధంగా చేపడుతున్నారు, అందులో తీసుకున్న సంస్కరణ గురించి రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ కు సమగ్రంగా వివరించారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై సమగ్రంగాసమీక్షించుకోవడం జరిగిందన్నారు. తిరుపతి అతి సున్నితమైన జిల్లా అని గత ఒక సంవత్సర కాలంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించామన్నారు. సాధారణ మానవుని సమస్యలను కూడా పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి శాంతి భద్రత పరమైన సమస్యలు లేవని ,అలాగే రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం తదితర సమస్యలు కూడా లేవన్నారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సూచించిన అంశాలన్నిటిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ కు వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిమను అందజేశారు.*
ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ నరసింహులు, తిరుపతి ,శ్రీకాళహస్తి,సూళ్లూరుపేట ఆర్డీవోలు బి రామమోహన్, ఎం. భాను ప్రకాష్ రెడ్డి, ఈ.కిరణ్మయి సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, కలెక్టరేట్ లోని వివిధ విభాగాలకు చెందిన సెక్షన్ హెడ్లు,డిప్యూటీ కలెక్టర్లు, సిబ్బంది జిల్లాలోని తహసీల్దారులు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.