నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎం ఎస్ ఎం ఈ లు మరింతగా ఎదగాలి
నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎం ఎస్ ఎం ఈ లు మరింతగా ఎదగాలి
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పరిమిత ఉద్యోగ కల్పనలో ఎం ఎస్ ఎం ఈ ల పాత్ర అభినందనీయం
రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ , సెర్ప్, ఎన్ ఆర్ ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
తిరుపతి, జూన్ 27:
నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎం ఎస్ ఎం ఈ లు మరింతగా ఎదగాలని రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ , సెర్ప్, ఎన్ ఆర్ ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం స్థానిక తాజ్ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్.పి. సోమనాథ్, రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ తమ్మి రెడ్డి శివశంకర రావు, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ , రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సి.ఈ.ఓ. ఎం.విశ్వ, తిరుపతి, సత్యవేడు ఎం ఎల్ ఎ లు ఆరణి శ్రీనివాసులు, కె.ఆదిమూలం, మాజీ ఎం ఎల్ ఎ సుగుణమ్మ లతో కలసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎం ఎస్ ఎం ఈ లు మరింతగా ఎదగాలన్నారు. ప్రపంచ MSME దినోత్సవాన్నితిరుపతిలోనిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి హృదయ పూర్వక అభినందనలు తెలియ జేశారు. నిన్న జరిగిన రివర్స్ బయ్యర్ - సెల్లర్స్ మీట్ లోపాల్గొన్న వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. ఈ సంవత్సరానికి MSME డే థీమ్ అయిన "సస్టైనబుల్ గ్రోత్ మరియు ఇన్నొవేషన్కు MSME ల పాత్రను పెంపొందించడం" పై ఎస్.పి. సోమనాథ్ ప్రసంగం అత్యంత ప్రేరణాత్మకంగా ఉందన్నారు. టెక్నాలజీ స్వీకరణ, పరిశ్రమ పునరుజ్జీవన మరియు MSME ల అభివృద్ధికి ఆయన సూచనలు అమూల్యమైనవన్నారు. MSME ఛైర్మన్ శివ శంకర రావు తమ్మిరెడ్డి MSME రంగానికి సంబంధించి పలు అంశాలపై గౌరవంగా పనిచేస్తున్నారని రివర్స్ బయ్యర్ -సెల్లర్స్ మీట్ ను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఎంతో ఉత్సాహంగా తోడ్పాటును అందిస్తున్నారని ఆయన భాగస్వామ్యం MSME లకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి, సత్యవేడు ఎం.ఎల్.ఎ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు అనేక సంస్థలు MSME లను మద్దతు ఇవ్వడానికి జ్ఞాపకార్థక ఒప్పందాలపై (MOUs) సంతకాలు చేశారని, ముఖ్యంగా NSE (నేషనల్స్టాక్ఎక్స్ఛేంజ్) తోకుదిరినఒప్పందం MSME లకు IPO వైపు తీసుకెళ్లే కీలకమైన అడుగని, ఇది MSME ఫైనాన్సింగ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందన్నారు.
జూన్ 27 వ తేదీని అంతర్జాతీయ MSME దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని , MSME లు వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద ఉద్యోగ కల్పన దారులుగా నిలిచారన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో 90% MSME లేనని, 60–70% ఉద్యోగాలు వీటి ద్వారా నే సృష్టించ బడుతున్నాయన్నారు. సుమారు 50% ప్రపంచ GDP కు MSME లేకారణమన్నారు. భారతదేశంలో 30% జీడీపీకి, 45% ఎగుమతులకు, 11 కోట్లకు పైగా ఉద్యోగాలకు MSME లే వెన్నెముక అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024–25 ఆర్థిక సర్వే ప్రకారం, పరిశ్రమలు రాష్ట్ర GVAలో 23.17% వంతు కల్పిస్తున్నాయని, ఇందులో MSME లపాత్ర అత్యంత ప్రధానమైనదన్నారు. ఈ రంగం సామాజిక–ఆర్థిక స్థితి గతుల అభివృద్ధికి ఎంతో ఉపకారం చేస్తోందని అన్నారు. అందుకే మిమ్మల్నిఅందరినీ మళ్ళీ అభినందిస్తున్నానన్నారు. జూన్ 4, 2024న, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్నిబాధ్యతగా చేపట్టినవెంటనే, MSME, SERP మరియు NRI శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని , ఇది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేదన్నారు. "ఒకకుటుంబం – ఒక పారిశ్రామికవేత్త" అనే దృష్టికోణంతో MSMEలు, జీవనోపాధిమరియు NRI పెట్టుబడుల మధ్య వారధి గా పనిచేస్తోందన్నారు. SERP ద్వారా SHG మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం, వారి ఆర్థిక స్థితిని మెరుగు పరచడంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదాహరణకు:రూ.90,000 కోట్ల SHG క్రెడిట్ లింకేజ్ గ్రామీణ ప్రాంతాలలో రానుందని, దీన్ని ఉత్పాదక, ఉపాధిగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇవాళ అవార్డులు పొందిన మహిళల్లో కొన్ని SHG లు నుంచి ఉండవచ్చునని ఇది మా కార్యక్రమాల విజయాన్నిచూపిస్తోందన్నారు.
MSME లకు పలు సౌకర్యకరమైన పథకాలను అందిస్తున్నామని, RAMP పథకం ద్వారా IP సదుపాయాలు, స్కిలింగ్, బిజినెస్ డెవలప్ మెంట్ సర్వీసులు లాంటి అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దీనిని జిల్లా స్థాయికి విస్తరిస్తున్నామన్నారు. కలెక్టర్లను ప్రధాన పాత్రదారులుగా మార్చి స్థానిక అవసరాలకు అనుగుణంగా MSME సపోర్ట్ సర్వీసులను అమలు చేస్తామన్నారు. సూక్ష్మ తరహా ఎంటర్ ప్రైజర్ చిన్న తరహా ఎంటర్ ప్రైజర్ గా మారాలని, చిన్న తరహా ఎంటర్ ప్రైజర్ మద్య తరహా ఎంటర్ ప్రైజర్ గా మారాలనేది తమ లక్ష్యమని ఇందుకోసం ముఖ్యమంత్రి గారు MSME పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 MSME పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పార్కులు గ్రామీణ ప్రాంతాల సమీపంలో పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. తద్వారా కార్మిక రాకపోకలు తగ్గుతాయని , ఆపరేటింగ్ ఖర్చులు తగ్గుతాయని, . కొన్ని పార్కులు సెక్టార్ స్పెసిఫిక్ గా అభివృద్ధి చేయబడతాయని, ఉదాహరణకు, ISRO వంటి సంస్థల సమీపంలో అంతరిక్ష సంబంధిత MSME పార్కులు ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వారు కూడా పార్కులను నిర్మించవచ్చన్నారు. పెద్ద స్థలాలు కలిగిన వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పార్కులు నిర్మించవచ్చని, విద్యుత్, నీరు, రవాణా వంటి మౌలిక వసతులతో కూడిన ప్లాట్లు MSMEలకు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఎకరాకు, CETP, డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. ప్రపంచం దిశగా MSMEలు ఆలోచించాలని డిజిటల్ టెక్నాలజీని స్వీకరించాలని ONDC, ERP, AI, IOT లాంటి టూల్స్ MSMEల ను సమర్థవంతంగా మారుస్తాయన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానన్నారు. జిల్లాలో 1 లక్షా 80 వేల మందికి పైబడి ఎం ఎస్ ఎం ఈ ల రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. జిల్లాలో ఆటో కాంపో నెంట్ మరియు ఇంజనీరింగ్ , వ్యవసాయ ఆధారిత మరియు ఫుడ్ ప్రాససింగ్ టెక్స్టైల్ మరియు గార్మెంట్స్, హ్యాండి క్రాఫ్ట్స్ మరియు ట్రెడిషనల్ ఆర్ట్స్, ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు , ప్యాకేజింగ్ మరియు ప్రింటింగ్ , సర్వీస్ ఆధారిత ఎం ఎస్ ఎం ఈ రంగాలు ఉన్నాయన్నారు. ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ కార్యక్రమంలో 2024-25 సంవత్సరానికి గాను 186 యూనిట్ల లక్ష్యానికి 647 యూనిట్ లను స్థాపించడం జరిగిందన్నారు. అలాగే పి.ఎం. విశ్వ కర్మ యోజన, సింగల్ విండో సిస్టం, ఎం ఎస్ ఎం ఈ లకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీం, ముద్రా లోన్ లు, స్టాండ్ అప్ ఇండియా ద్వారా బ్యాంకు రుణాలు, తదితరాలను అందిస్తున్నామన్నారు.
రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ తమ్మి రెడ్డి శివశంకర్ రావు మాట్లాడుతూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడుపుతున్న అందరినీ అభినందించడానికి ఈ ప్రంపంచ ఎం ఎస్ ఎం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ దేశంలో 6.80 కోట్ల ఎం ఎస్ ఎం ఈ ల ద్వారా 11 కోట్ల ఉద్యోగాల కల్పన ఈ రంగం నుండి జరుగుతోందన్నారు. ఆర్ధిక మాంద్యంలో కాని , కరోనాలో కాని ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పెద్ద పరిశ్రమలు నిలబడలేకపోయినా చిన్న పరిశ్రమలు మాత్రమె నిలదొక్కుకున్నాయన్నారు. క్వాలిటీ సర్టిఫికేషన్, రిసెడ్యూర్ సర్టిఫికేషన్ కేంద్రాలు బెంగళూరు, ఉత్తర ప్రదేశ్ లలో మాత్రమె ఉందని మన రాష్ట్రంలో కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న నాలుగు సంవత్సారాల కాలంలో ఎం ఎస్ ఎం ఈ లను మరింత అబ్దివ్రుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ప్రభుత్వ సలహాదారు డా.ఎస్.పి.సోమనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తాపత్రయ పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎం ఎస్ ఎం ఈ రంగానికి సహాయం చేసేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈ రంగానికి రుణ సౌకర్యం కల్పించి వాటిని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి ఇంటిలో నుండి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలనుకోవడం ఒక గొప్ప ఆలోచన అన్నారు.
తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో శ్రీ సిటీ, పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం ఎస్ ఎం ఈ ల ఏర్పాటుకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నారా లోకేష్ ఎన్నికల ముందు చెప్పారని అందుకు తగ్గ విధంగానే అనేక పర్యటనలు చేసి పలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. గతంలో మరుగున పడిన ఈ రంగాన్ని ముందుకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు కృషి చేస్తున్నారన్నారు. ఇంటికొక పారిశ్రామిక వేత్తను తాయారు చేయడం ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. తిరుపతి జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నారు.
సత్యవేడు శాసనసభ్యులు కె.ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల ఏర్పాటుతోనే ఆర్థిక పురోగతి దోహదపడుతుందని భావించారని తద్వారా పలు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. శ్రీ సిటీ లో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని శ్రీ సిటీ ద్వారా ఆ ప్రాంతంలోని ప్రతి ఇల్లు లబ్ది పొందుతోందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రైల్వే కనెక్టివిటీ , ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉన్నాయన్నారు. పారిశ్రామిక వేత్తలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి అనేది ఒక సంవత్సరంలో నే సాధ్యపడదని మరిన్ని పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాలలో చిన్న పాటి కుటీర పరిశ్రమలు నడుపుతున్న వారికి ఆర్థికంగా సహాయం అందించాలన్నారు.
రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సి.ఈ.ఓ. ఎం.విశ్వ స్వాగతోపన్యాసం చేస్తూ ప్రపంచ ఎం ఎస్ ఎం ఈ దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించడం శుభసూచకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే లక్ష్యం తో పని చేస్తోందన్నారు. 175 నియోజవర్గ కేంద్రాలలో ఎం ఎస్ ఎం ఈ పార్కులను ఏర్పాటు చేయనుందని అన్నారు. దేశ, రాష్ట్ర ఆర్ధిక భవిష్యత్తుకు ఎం ఎస్ ఎం ఈ రంగం దోహదపడుతుందన్నారు. నేటి కార్యక్రమంలో 9 ఎం.ఓ.యు లను కుదుర్చుకోవడం జరుగుతోందని అలాగే ఆర్ బి ఎస్ ఎం ట్రాకర్ ప్రారంభిస్తున్నామని , RAMP Explainer v1 & MSME Scheme Book ను అతిదులచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రిని వెంకటేశ్వర ప్రతిమను అందించి శాలువా తో సత్కరించారు.అలాగే కార్యక్రమానికి హాజరైన అతిధులకు, విశేష ప్రతిభ కనబరచిన ఎం ఎస్ ఎం ఈ లకు జ్ఞాపికలను అందించి సత్కరించారు. NSE సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ అయ్యర్ మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటులో విశేష కృషి చేసి ఈ నెలా ఖరు లో పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ ఎగ్జిగ్యుటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబును మంత్రి శాలువ, జ్ఞాపికను అందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎం ఈ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా క్రింది సంస్థలలో ఆంధ్ర ప్రదేశ్ ఎం.ఎస్.ఎం.ఈ అవగాహన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది.
1. NRDC (నేషనల్ రిసెర్చ్ డెవెల్మంట్ కార్పొరేషన్ )
2. MSME, Technology Centre, Pudi, Visakhapatnam
3. NI-MSME (National Institute for MSME), Hyderabad
4. NID (National Institute of Durion), SERP and APMSMEDC Tripartite agreement
5 NPC (National productivity Council)
6. CSTMSE (Credit guarantee trust for micro and small enterprises)
7. SIDBI (Small Industries Development bank of Grdfx)
8. FTEO (federation of Indian exports Organisation
9. National Stock Exchange