రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మాణం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మాణం

  • విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు షైనింగ్ సార్ట్స్ అవార్డులు అందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్
  • 172 మందిని అవార్డులతో సత్కరించిన మంత్రి కందుల దుర్గేష్
  • అవార్డులు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు శుభాశీస్సులు అందించిన మంత్రి దుర్గేష్
  • సాధారణ విద్యను పక్కనబెట్టి అవకాశాల గని అయిన క్వాంటం వ్యాలీని అభ్యసించాలని సూచన
  • పట్టుదల, కష్టపడేతత్వం, బాగా చదవగలిగిన నేర్పు, సృజనాత్మకత, టెక్నాలజీని అందిపుచ్చుకునే సామర్థ్యం అలవరుచుకోవాలని విద్యార్థులకు పిలుపు
  • విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కావద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని పిలుపు

రాజమహేంద్రవరం: ఒక దేశపు భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుందన్న వ్యాఖ్యలను గుర్తుచేస్తూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 172 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులతో సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం రాజమహేంద్రవరం టి. నగర్, గోదావరి గట్టు సమీపంలోని శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి వేదికగా పదవ తరగతి, ఇంటర్ లో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమ మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యార్థులకు అవార్డులు అందించారు. విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు అందిస్తున్న షైనింగ్ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్క విద్యార్థికీ మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభకు అహర్నిశలు కృషి చేసిన విద్యాశాఖ అధ్యాపక బృందాన్ని, డీఈవోను, తల్లిదండ్రులను మంత్రి దుర్గేష్ అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేసి తాము కూడా ప్రతిభా పురస్కారం పొందాలనే స్ఫూర్తిని నేడు అవార్డులు అందుకుంటున్న విద్యార్థులు రగిలించారన్నారు. విద్యార్థులంతా సంపూర్ణంగా చదువులో నిమగ్నమై ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. నేటి ప్రపంచానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన మేరకు ప్రతి ఒక్కూ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అద్భుతమైన వాతావరణం సృష్టించిందన్నారు. మంచి విజన్ ఉన్న నాయకులు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రపంచం సాంకేతిక ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన సాధారణ విద్యను పక్కనబెట్టి ఉపాధి అవకాశాలను కల్పించే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం వ్యాలీ తదితర టెక్నాలజీలను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రూ.2500 కోట్ల పెట్టుబడితో 2030 నాటికి 2 బిలియన్ ల క్వాంటం ఎకానమీ తద్వారా 5000 స్కిల్డ్ జాబ్స్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులంతా తమ ప్రతిభను ఆయా రంగాల్లో మలుచుకుంటే భవిష్యత్ బాగుంటుందన్నారు. టెక్నాలజీ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఆదర్శమని సాక్షాత్తు ప్రధాన మంత్రి చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఏ రంగంలో అయినా కొత్త రకమైన ఏ టెక్నాలజీ వచ్చినా ముందు ఏపీ నుండే ఆరంభం అవుతుందని తెలిపారు. నెట్ వర్కింగ్ రిపిట్, కటింగ్ హెచ్ టెక్నాలజీస్ ప్రభుత్వ విధానమని, ప్రతి విద్యార్థి దీన్ని అందిపుచ్చుకోవాలన్నారు.తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు వీలు కలుగుతుందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన క్రీడామైదానాలు, టాయిలెట్లు లేని కారణంగా డ్రాపౌట్ సంఖ్య పెరిగిందన్నారు.. ఈ క్రమంలో ఆడపిల్లల అవసరాలు గుర్తించి ప్రభుత్వ బడుల్లో టాయిలెట్ల ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆ అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేస్తోందన్నారు. 

రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. విద్యార్థులంతా బాగా చదువుకొని క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. వయసు పెరుగుతుందనే ఉద్దేశంతో విద్యార్థులు చెడు వ్యసనాలకు గురికావద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, బానిస కావొద్దని కోరారు. మత్తుపదార్థాలకు బానిసలైతే జీవితం నాశనమై భవిష్యత్ అంధకారం అవుతుందని వివరించారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలిగితే ఈ కార్యక్రమానికి సహకరించినవారవుతారన్నారు. 

కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహార్, శెట్టి బలిజ కార్పొరేషన్ సత్తిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ చిన రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ అధికారులు, సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు 

పాల్గొన్నారు.

Comments

-Advertisement-