అమృత్ స్కీమ్ ద్వారా తాగు నీరు పైప్ లైన్ పనుల కోసం టెండర్లు పిలిచాం
అమృత్ స్కీమ్ ద్వారా తాగు నీరు పైప్ లైన్ పనుల కోసం టెండర్లు పిలిచాం
- AIIB నుంచి 5350 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం
- రాష్ట్రంలో వందశాతం ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు
- టిడ్కో ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం
- అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
అమరావతి...
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలోనే నిలిచిపోయాయని అన్నారు...ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు వద్ద మున్సిపల్ శాఖపై సమీక్ష జరిగింది..ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియా తో మాట్లాడారు.ఆయన మాట్లాడిన అంశాలు....
మున్సిపాలిటీల్లో ప్రధానంగా ప్రజలంతా కోరుకునేది స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు...ఆ తర్వాత మంచి రోడ్లు,పార్కులను కోరుకుంటారు. 2014-19 మధ్య కాలంలో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి అనేక నిధులను తీసుకొచ్చాం..ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(AIIB)నుంచి 5800 కోట్లు,స్వచ్ఛ భారత్ నుంచి 3000 కోట్లు విడుదలకు ఆమోదం తీసుకున్నాం...అయితే గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ నిధులు మధ్యలోనే నిలిచిపోయాయని అన్నారు..తిరిగి గత ఏడాదిగా ఎన్ని కష్టాలున్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ మళ్లీ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు...ఇప్పటికే అమృత్ స్కీం నిధులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు.ఈ పథకానికి సంబంధించి మంచి నీటి పైప్ లైన్ల కోసం టెండర్లు పిలిచామన్నారు మంత్రి నారాయణ.ఈ పనులు పూర్తయితే 85 శాతం ఇళ్లకు నేరుగా తాగునీరు అందుతుందన్నారు...అయితే బోర్ల నుంచి వచ్చే నీరు కాకుండా నదులు,కాలువల ద్వారా ఈ నీటిని ఇళ్లకు సరఫరా చేస్తామన్నారు...మరోవైపు ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి వచ్చే 5350 కోట్లతో మిగిలిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు,డ్రైనేజి పైప్ లైన్లు పూర్తి చేస్తామన్నారు...ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో వందశాతం ఇళ్లకు రక్షిత నీరు అందుతుందన్నారు...ఈ నిధులకు సంబంధించి రాష్ట్ర వాటా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఆర్ధిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ఇక శుద్ది చేసిన నీటిని డ్రైనేజిల్లోకి వదిలేలా ఎస్టీపీలను కూడా 2029కి పూర్తి చేస్తామన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రతిరోజూ 8000 టన్నుల ఘన వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయి.వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి తయారుచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు...రాష్ట్రంలో 2014-19 మధ్య కాలంలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు నెలకొల్పాలని నిర్నయించామని,అయితే ప్రస్తుతం గుంటూరు,విశాఖలో మాత్రమే రెండు ప్లాంట్ లు అందుబాటులోకి వచ్చాయన్నారు...మరో ఆరు ప్లాంట్ లు త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు...ఈ ఆరింటిలో రాజమండ్రి,నెల్లూరు ప్లాంట్ లకు ఇప్పటికే టెండర్లు పూర్తయినట్లు మంత్రి చెప్పారు... కడప, కర్నూలు, విజయవాడ,తిరుపతిలో ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు...ఈ ప్లాంట్ లన్నీ అందుబాటులోకి వస్తే 7500 టన్నుల చెత్త ప్రతిరోజూ విద్యుత్ గా మారుస్తామని,మరో 500 టన్నుల చెత్తను వివిధ రూపాల్లో నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.మరోవైపు గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన 85 లక్షల మట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ను వచ్చే అక్టోబర్ రెండో తేదీ నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు. మున్సిపాల్టీల్లో పారిశుద్య నిర్వహణ కోసం కాంపాక్టర్లు,స్వీపింగ్ మెషీన్ల కొనుగోలు కోసం 225 కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
2014-19 మధ్య కాలంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించగా... గత ప్రభుత్వం వాటిని 2,60,000కు తగ్గించేసిందన్నారు...ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండానే లోన్లు తీసుకోవడంతో నాన్ పేమెంట్ కేటగిరీలోకి వెళ్లిపోవడంతో సుమారు 140 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందన్నారు...త్వరలోనే టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
మున్సిపాల్టీల్లో ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.