రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TET Exams: నేటి నుంచి టెట్ పరీక్షలు.. సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ

Telangana TET Exam TET Exam Telangana Teacher Eligibility Test Telangana Education Department TS TET TS DSC TET EXAM DATES TET SHEDULE AP TET AP
Mounikadesk

TET Exams: నేటి నుంచి టెట్ పరీక్షలు.. సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ

  • తెలంగాణలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం
  • జూన్ 18 నుంచి 30 వరకు రెండు సెషన్లలో నిర్వహణ..
  • రాష్ట్రవ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలు సిద్ధం..
  • మొత్తం 1.83 లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలు..


తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి, అంటే జూన్ 18వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది.

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగుతుంది.

వివిధ తేదీల్లో పేపర్ల వారీగా పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది:

పేపర్-2 పరీక్షలు జూన్ 18, 19, 24 (మొదటి షిఫ్టు మాత్రమే), 28, 29, 30 తేదీలలో జరుగుతాయి. 

పేపర్-1 పరీక్షలు జూన్ 20, 23, 24 (రెండవ షిఫ్టు మాత్రమే), 27 తేదీలలో నిర్వహించనున్నారు.

ఈ ఏడాది టెట్ కోసం ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో పేపర్-1 కోసం 63,261 మంది, పేపర్-2 కోసం 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకూ కలిపి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య సుమారు 15 వేల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 


Comments

-Advertisement-