నైపుణ్యం పోర్టల్ ను సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టండి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
నైపుణ్యం పోర్టల్ ను సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టండి
- ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారి కోసం సహాయక మార్గదర్శకాలు రూపొందించండి
- నైపుణ్య విభాగంపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
ఉండవల్లిః యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ ను ఆగష్టు నాటికి పూర్తిచేసి సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయింట్ ఆఫీసర్ ను డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ గా మార్చి.. వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓంక్యాప్ ద్వారా కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయక మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678, లేదా వాట్సాప్ నెంబర్ 8500027678 ను సంప్రదించాలని సూచించారు. ఇటీవల థాయ్ ల్యాండ్ లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓంక్యాప్, ఎన్ఆర్ టి ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్, కాలేజి ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్ శ్రీమతి సీత శర్మ, ఏపీఎస్ఎస్ డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రఘు తదితరులు పాల్గొన్నారు.
Comments