రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాను నిరుద్యోగులకు అందించడమే చంద్రబాబు లక్ష్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాను నిరుద్యోగులకు అందించడమే చంద్రబాబు లక్ష్యం

  • ఉద్యోగాలతో పాటు ఇంటికో పారిశ్రామిక వేత్త తయారు చెయ్యడమే సీఎం లక్ష్యం
  • సీఎం చంద్రబాబు ఏపీకీ సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఆసరా
  •  గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి


అనకాపల్లి (మాడుగుల), జూలై 7: ఐదేళ్ల కాలంలో నిరుద్యోగ యువతీ, యువకులకు 20లక్షల ఉద్యోగాలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని, రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉం డటంతో పాటు పీఎం నరేంద్ర మోడి ఆశీస్సులు ఏపీ రాష్ట్రంపై పుష్కలంగా లభిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొల్లు పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం మాడుగుల టీటీడీ కళ్యాణమండపంలో జరిగిన డీసీసీబి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యన్నా రాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో మంత్రి కొలుసు మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయేలా విధ్వంస పాలన చేసిందని యద్దేవ చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రo అప్పులుపాలవ్వడానికి గల కారణాలు తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబుకి ఆరు నెలలు సమయం పట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే సమయానికి పది లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న, దాన్ని అధిగమించే విధంగా రాష్ట్రానికి పెట్టుబడి సంస్థలను రప్పించి. అతలకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టారని అన్నారు. అంతే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఎంతటి దౌర్భగ్యమైన పాలన చేసిందంటే గత మా ప్రభుత్వం హయంలో విశాఖపట్నం సిటీలో టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించే యోచనలో 80శాతం ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తే గత ప్రభుత్వ టిడ్కో లబ్ధిదారుల పేరున బ్యాంక్లలో రుణాలు తీసుకొని ఆ సొమ్ముని కూడా దిగమింగి ఒక్క పైసా కూడా లబ్దిదారులకు ఇవ్వని గత ప్రభుత్వం అన్నారు. పైగా టిడ్కో ఇళ్లకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తే వాటిని చక్కదిద్దింది మా ముఖ్యమంత్రే నని అన్నారు. మా ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్ట్లో పొందుపరిచిన విధంగా తల్లికి వందన పథకం ద్వార ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి అందరికీ సంబందించి నగదు తల్లుల ఖాతాల్లో జమ అయ్యిందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విదంగా, దేశంలో ఉన్న అన్ని సంస్థలను ఏపీ రాష్ట్రానికి తీసుకొని వస్తున్నారని అన్నారు. రిలయన్స్ సంస్థ వారు ఏపీలో 65కోట్లు పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభత్వం 21 రోజుల్లో వ్యవసాయ రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన నగదు అందిస్తామని నమ్మ బలికితే దాన్ని కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులకు బాకాయి ఉన్న 1635కోట్లు చెల్లించారని అన్నారు. పోగాకు రైతులకు కూడా న్యాయం చేశారని అన్నారు. భవిష్యత్తులో ఏపీ రాష్ట్రంలో నిరుద్యోగులు పొట్ట చేత్తోపట్టుకొని వలస పోకుండా ఉండాలంటే మన రాష్ట్రంలో పారిశ్రామికంగా, పర్యాటకం కింద అభివృద్ధి చెందితేనే యువతకు ఉన్నచో టనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13నెలలు కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేసే విధం గా అడుగులు వేస్తున్నామన్నారు. 

డీసీసీబి పర్శన్ ఇన్చార్జి కోన తాతారావు మాట్లాడుతూ కేంద్ర సహకార బ్యాంక్ ద్వార తక్కువ వడ్డీకే రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణాలతో పాట్లు వ్యవసాయానికి సంబంచి రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మాడుగుల బ్రాచి పరిధిలో డ్వాక్రా రుణాలు, జీవిత భీమా, ఎస్టీ అదర్స్కి సంబంధించి 2కోట్ల 58లక్షలు మంజూరు చెయ్యడం జరిగిం దని అన్నారు. అలాగే ఎమ్మెల్యే బండారు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబులు కూడా ప్రసంగించి మాడుగుల నియోజకవర్గ పరిస్థితులు గురించి మంత్రి పార్ధసారదికి వివరించారు. 

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ పరిశీలకులు ఏసుదాసు, నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి వి.వి.రమణ, నియోజకవర్గం ప్రత్యేక అధికారి జిల్లా వ్యవసాయ శాఖ బి మోహన్ రావు, జిల్లా గృహనిర్మాణ శాఖ పధక సంచాలకులు శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అద్దెపల్లి జగ్గారావు, ఉండూరు దేముడు, సీఈవో డీవిఎస్ వర్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

అంతకుముందు మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సాలువాతో సత్కరించి, అమ్మవారి మెమోం టోని అందించారు.

Comments

-Advertisement-