రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో సాక్షులుగా సచివాలయ సిబ్బంది

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో సాక్షులుగా సచివాలయ సిబ్బంది

  • రిజిస్ట్రేషన్, పాఠశాల, కళాశాలలకు కావలసిన మొక్కల రిజిస్ట్రేషన్ లు 100 శాతం పూర్తి కావాలి
  • రేపు భారీ స్థాయిలో చేపట్టే హార్టికల్చర్ ప్లాంటేషన్ విజయవంతం చేయాలని పిలుపు
  • వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్


అనంతపురం, జులై 07 :

మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో సాక్షులుగా సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్, పాఠశాల, కళాశాలలకు కావలసిన మొక్కల రిజిస్ట్రేషన్ లు 100 శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0 (మెగా PTM 2.0) కార్యక్రమంపై అసిస్టెంట్ కలెక్టర్, డిఎఫ్ఓ, డిఈఓ, డివిఈఓ, సమగ్ర శిక్ష ఏపిసి, డిఎంహెచ్ఓ, డ్వామా పిడి, సివిల్ సప్లై డిఎం, డిఎస్ఓ, ఎంఈఓలు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0 ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాక్షులను (విట్ నెస్) పాఠశాల వారీగా సచివాలయ సిబ్బందిని సరి చూసుకోవాలనీ, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలని, ఈ ప్రక్రియపై ఎంపీడీవోలు బాధ్యత వహించాలన్నారు. సాక్షులుగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉండరాదని, థర్డ్ పార్టీ ఉండాలని, అన్నారు. ఇప్పటివరకు 2,420 పాఠశాలలకు 1,616 రిజిస్ట్రేషన్ చేయగా, 804 పాఠశాలల్లో సాక్షుల నమోదు పెండింగ్ ఉందని, ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో 100 శాతం సాక్షుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. ప్లాంట్ రిజిస్ట్రేషన్ల స్టాటస్ కు సంబంధించి 4 నుంచి 10వ తరగతి వరకు జిల్లాలో 2,306 పాఠశాలలు ఉండగా, ఇప్పటివరకు 1,358 పాఠశాలల్లో ప్లాంట్ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని, మిగిలిన పాఠశాలల్లో ఈ ప్రక్రియను మంగళవారం ఉదయంలోపు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కూడా మరిన్ని పెంచాలని, విద్యార్థుల చేత జాగ్రత్తగా మొక్కలు నాటించాలని సూచించారు. పాఠశాలలకు మొక్కల పంపిణీ పూర్తిగా చేపట్టాలని, ఇందుకు సంబంధించి గ్రామ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటర్ చేయాలన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పాఠశాలల్లో, కళాశాలల్లో ఒక స్ఫూర్తితో విద్యార్థుల తల్లిదండ్రులకు స్పోర్ట్స్ యాక్టివిటీలను పీడీలు, పీఈటీలు బాధ్యతగా చేపట్టాలన్నారు. కామన్ మీటింగ్ ఎజెండాలో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన 30 సెకండ్ల వీడియో క్యాప్చర్ చేయాలని, 2 ఫోటోగ్రాఫ్ లు తీసుకోవాలని, ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఇది ఎంతో ముఖ్యమని, వాటిని లీప్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఇద్దరు ఉత్తమ విద్యార్థులను ప్రతి పాఠశాలలో గుర్తించాలన్నారు. సే నోటు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా ఏర్పాటులు చేయాలని, ఈ విషయమై పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. గ్రీన్ పాస్పోర్ట్ కాపీలు మంగళవారం పంపించడం జరుగుతుందని, వాటిని మండలాలకు పంపించేలా చూడాలని, ఇందుకు సంబంధించి ఎక్సెల్ సీట్ లో నివేదిక అందించాలన్నారు. ఆయా పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రతిజ్ఞ కాపీలను సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. చివరగా ఎస్ఎంసి చైర్పర్సన్ నుంచి వందన సమర్పణ కార్యక్రమం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజాప్రతినిధులకు, అందరికీ ఆహ్వానాలు పంపడం 100 శాతం వెంటనే పూర్తి కావాలన్నారు. లీప్ యాప్ లో వంద శాతం స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని, అన్ని చోట్లా ఫోటో బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెగా పేరంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో బాగా రోజువారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరిగే సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం ఉండరాదని, ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. పిల్లల హెల్త్ కార్డులో వారి ఆరోగ్య వివరాలను డిఎంహెచ్ఓ సిబ్బంది నమోదు చేయాలన్నారు.

రేపు భారీ స్థాయిలో హార్టికల్చర్ ప్లాంటేషన్ నిర్వహణ :

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 8వ తేదీన భారీ స్థాయిలో చేపట్టే హార్టికల్చర్ ప్లాంటేషన్ ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,000 ఎకరాల్లో హార్టికల్చర్ ప్లాంటేషన్ చేపట్టాలని లక్ష్యం ఇవ్వడం జరిగిందని, ఇందుకు సంబంధించి గుంతలు తవ్వే కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, లక్ష్యం మేరకు ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్లో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ఆహ్వానించాలన్నారు. ఈనెలాఖరు నాటికి లక్ష్యం మేరకు పిట్టింగ్, ప్లాంటేషన్ పూర్తి కావాలని, ఈ సీజన్లో మంగళవారం నుంచి చేపట్టే హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇందులో ఎంపీడీవోలు కూడా పాల్గొనాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా డ్వామా పిడి సలీమ్ భాష మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో నిర్వహించే హా హార్టికల్చర్ ప్లాంటేషన్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొంటారన్నారు. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొంటారని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కంబదూరు మండలం కదిరిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, గుత్తి మండలంలోని కరిడికొండ గ్రామంలో అనంతపురం పార్లమెంటు సభ్యులందరికీ లక్ష్మీనారాయణ మెగా హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, డిఎఫ్ఓ విగ్నేష్ అప్పావు, డీఈవో ప్రసాద్ బాబు, డివిఈఓ వెంకటరమణ నాయక్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి పాల్గొన్నారు.

Comments

-Advertisement-