రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మైనారిటీల పురోభివృద్ధికి విస్తృత చర్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మైనారిటీల పురోభివృద్ధికి విస్తృత చర్యలు

  • సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి
  • రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
  • కేంద్ర పథకాల సమర్థ వినియోగం, హజ్ - 2026, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఉపాధి రుణాలు పై మంత్రి ఫరూక్ సమీక్ష


రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల పురోభివృద్ధి కి ప్రణాళికా బద్దంగా కూటమి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టి ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీ కార్యాలయంలో మైనారిటీ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, వివిధ భవనాల నిర్మాణ పనుల పూర్తికి నిధుల వినియోగం, ప్రధాన మంత్రి విరాసత్ క సంవర్ధన్ ( పీఎం వికాస్ ), ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ( పీఎంజేవీకే ), జాతీయ మైనారిటీల అభివృద్ధి ఆర్థిక సంస్థ ( ఎన్ ఎం డి ఎఫ్ సి ) పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధుల వినియోగం, హజ్ -2026 యాత్రకు తీసుకొనే ముందస్తు చర్యల ప్రణాళిక,వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పురోభివృద్ధికి చర్యలు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల పంపిణీ, తదితర అంశాలపై మైనారిటీ సంక్షేమ శాఖ విభాగాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయన్న విషయాలపై మంత్రి ఫరూక్ సుదీర్ఘంగా సమీక్ష చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి యాకుబ్ భాష,వక్ఫ్ బోర్డు సీఈవో మహమ్మద్ అలీ, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ లు తదితరులు తమ విభాగాల పరిధిలో అమలవుతున్న, తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ హజ్ యాత్రకు రాష్ట్రం నుండి వెళ్లిన 1618 మంది యాత్రికులకు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. హజ్ యాత్రలో సౌకర్యాల కల్పన పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇన్ స్పెక్టర్లను పంపి , హైదరాబాద్, బెంగళూరు ఎంబార్ కేషన్ సెంటర్ల ద్వారా వెళ్లిన యాత్రికులందరూ విజయవంతంగా యాత్ర ముగిసేలా ప్రభుత్వం నిరంతరంగా పర్యవేక్షించిందని తెలిపారు.హజ్ -2026 కు అవసరమైన అన్ని ముందస్తు చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయానికి అనుగుణంగా మైనారిటీ అనుబంధ సంక్షేమ విభాగాలన్నీ పనిచేయాలని ఆదేశించారు. కేంద్ర మైనారిటీ పథకాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకునేoదుకు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు . మైనార్టీల ఆర్థిక ఉన్నతి కోసం, స్వయం ఉపాధి కల్పన కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటు, సరళీకృతమైన విధానాలతో రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం, రాయితీకి సంబంధించిన అంశాలపై అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఫరూక్ అధికారులను ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలను అమలు చేయడం జరుగుతుందని, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, ఉన్న ఆస్తులను ఏ విధంగా వినియోగించుకొని అభివృద్ధి, ఆదాయం సమకూరేలా తీసుకునే చర్యలపై మైనారిటీ సంక్షేమ, అనుబంధ విభాగాల అధికారులకు మంత్రి ఫరూక్ దిశా నిర్దేశం చేశారు.

Comments

-Advertisement-