ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవార్డుల ప్రకటన ఉత్సాహనిస్తుంది
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అవార్డుల ప్రకటన ఉత్సాహనిస్తుంది
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రకటన ఉత్సాహినిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏపీ ఛాంబర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పరిచయ కార్యక్రమంను విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ కి ప్రోత్సాహకాలు పై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్రం లో రిజిస్టర్ కాబడిన కంపెనీ లను గుర్తించి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అవార్డ్స్ ఇవ్వడటం జరుగుతుందని మొత్తం గా 14 రంగాల్లో నామినేటెడ్ చేయటం జరుగుతుందన్నారు. అవార్డు గ్రహీతల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. మన రాష్ట్రం లో మెరుగైన వనరులు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవడంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టి సారించాలన్నారు. మన రాష్ట్రంలో మరో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, P4 మోడల్ ద్వారా సామాన్యుడిని సైతం పైకి తేవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి విజన్ మన రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా హైదరాబాద్ ను గమనించవచ్చని మంత్రి అన్నారు.
గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖామాత్యులు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు 12 రంగాల్లో 15 అవార్డులను అందించనున్నారని వివరించారు. ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య వారధిలా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ పనిచేస్తుందన్నారు. మన రాష్ట్రంలో 13 పోర్ట్స్ ను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ కాదు ఫోర్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రంలో ఉందని, టర్బో ఇంజన్ రూపం లో చంద్రబాబు, లోకేష్, పవన్,బీజేపీ లు లాంటి ఫోర్ ఇంజన్ లు కలిగి ఉన్నాయని ఇక అభివృద్ధిలో వెనకడుగు వేసే పరిస్థతి లేదన్నారు. పారిశ్రామిక వేత్తల తో పాటు ఉద్యోగస్తులకు కూడా అవార్డ్స్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు, పారిశ్రామిక వేత్తలకు మధ్య సత్సంబందాలు పెరుగుతాయని మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయ పడ్డారు.
ముందుగా మంత్రి పార్థసారథి ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆడియో విజువల్(ఏవీ)ని విడుదల చేయగా, మంత్రి కొల్లు రవీంద్ర అవార్డుల బ్రోచర్ ను విడుదల చేశారు. ఎన్టీయర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అవార్డుల లోగోను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయిన లేదా పనిచేస్తున్న సంస్థలు తమ నామినేషన్లను ధాఖలు చేయడానికి అర్హులని అన్నారు. నామినేషన్లను జూలై 30 లోపు ధాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ల ధాఖలు కోసం http://apchambers.in/business-awards-2025 వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. విజేతలను ఈ ఏడాది ఆగస్టు 30న నిర్వహించే కార్యక్రమంలో అవార్డులతో సత్కరించనున్నామని తెలిపారు. ఇతర వివరాలకు 9121221473, 9121221474, 9912092222 నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.