మహిళలు ,పిల్లల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాం.
మహిళలు ,పిల్లల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాం.
- నేర నివారణే ప్రథమ లక్ష్యం...
- సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి.
- జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
- మహిళలు,పిల్లల భద్రత పై కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో విద్యార్ధినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు .
- ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ముఖ్య అతిథి గా హజరయ్యారు.
- ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ....
ఈ రోజు కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలు, చిన్న పిల్లల పై జరిగే నేరాలను అరికట్టేందుకు మహిళా సంక్షేమం, భద్రత, మహిళా సాధికారత అనే అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శక్తి యాప్ , శక్తి వాట్సప్ సేవలు, శక్తి టీం పై విద్యార్ధినులకు అవగాహన కల్పిసున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
ఇంటర్నెట్, మొబైల్ డేటా వచ్చాక మహిళలు, యువతి,పిల్లలు టార్గెట్ చేసుకొని నేరాలు పెరిగిపోతున్నాయన్నారు.
మహిళా భద్రత కు పటిష్టమైన చట్టాలు, శక్తి టీం, శక్తి యాప్ లాంటివి ఉన్నాయని వీటిపై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని ప్రతి ఒక్కరు భాద్యతగా ఉండాలన్నారు.
24/7 శక్తి వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. శక్తి వాట్సాప్ 7993485111 , డయల్ 100, డయల్ 112 , కర్నూలు శక్తి వాట్సాప్ 7777877700, చైల్డ్ మ్యారెజెస్ 1098, సైబర్ క్రైమ్ 1930 ల పై అవగాహన చేస్తున్నామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం తమ ఫోన్ లలో సేవ్ చేసుకోవాలన్నారు.
ఎవరైనా ఈవ్ టీజింగ్ పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడిన ఆకతాయిలకు కౌన్సిలింగ్ తో పాటు కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ఒక రోజు లో ఒక కళాశాల, పాఠశాలలల్లో మహిళల భద్రత పై, సైబర్ నేరాల బారిన పడకూడదని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశిస్తున్నామన్నారు.
కర్నూలు డిఎస్పీ మాట్లాడుతూ... చదువుకున్న విద్యార్దినులు, మహిళలు ట్రాప్ అవుతున్నారన్నారు. అప్రత్తంగా ఉంటూ సమాజానికి అవగాహన కల్పించాలన్నారు.
మహిళా పియస్ డిఎస్పీ మాట్లాడుతూ... సోషల్ మీడియా పట్ల విద్యార్దినులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకు, ఉజ్వల భవిష్యత్తుకు మాత్రమే సోషల్ మిడియా ను వినియోగించాలన్నారు.
అనంతరం విద్యార్దినులు అడిగిన సందేహాలను జిల్లా ఎస్పీ గారు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డీన్. డా. దేవకి దేవి, కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, మహిళా పియస్ డిఎస్పీ శ్రీనివాసాచారి, సిఐలు అబ్దుల్ గౌస్, శ్రీధర్ , విజయలక్ష్మీ ,ఎస్సైలు , శక్తి టీం, పోలీసు సిబ్బంది, కళాశాల మహిళా విద్యార్ధినులు పాల్గొన్నారు.