రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డిసిహెచ్ య‌స్‌ల ప‌నితీరులో మార్పు రావాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 డిసిహెచ్ య‌స్‌ల ప‌నితీరులో మార్పు రావాలి

  • జిల్లా అధికారులు లీడ్ చేసే లీడ‌ర్లుగా ఎద‌గాలి
  • అవినీతిని స‌హించేదిలేదు
  • సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు బాగా త‌గ్గాలి-సాధార‌ణ ప్ర‌స‌వాలు పెర‌గాలి
  • సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ప్రిఆథ‌రైజేష‌న్లు పెంచాలి
  •  స‌మ‌య‌పాల‌న పాటించ‌ని డాక్ట‌ర్ల‌ను ఉపేంక్షించేది లేదు
  • డిసిహెచ్‌య‌స్‌లకు నాలుగు రోజుల రాష్ట్ర‌స్థాయి శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్‌


జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారుల(డిసిహెచ్‌య స్‌ల) ప‌నితీరులో మార్పురావాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. రెండు నెల‌ల క్రితం డిసిహెచ్‌య‌స్‌లు, డిఎంహెచ్వోల‌ స‌మీక్షా స‌మావేశంలో ప‌లు కీల‌కాంశాల్ని గ‌మ‌నించాన‌ని, వాటిని స‌రిచేసేందుకు శిక్ష‌ణివ్వాల‌ని భావించామ‌ని మంత్రి తెలిపారు. జిల్లాల్లో టీంను లీడ్ చేసే లీడ‌ర్లుగా జిల్లా అధికారులు ఎద‌గాల‌న్నారు. తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో 26 జిల్లాల డిసిహెచ్‌య‌స్‌ల‌కు నాలుగు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారంనాడు మంత్రి ప్రారంభించారు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ రూపొందించిన సమగ్ర యాప్ ను మంత్రి ఆవిష్క‌రించారు. డిసిహెచ్‌య‌స్‌ల‌ను ద్దేశించి మంత్రి మాట్లాడుతూ అవినీతిని ఏమాత్రం స‌హించేదిలేద‌న్నారు. సమన్వంతో పనిచేయడం ద్వారా వైద్యసేవల్లో ఆశించిన మార్పు తీసుకురావాల‌ని, డిసిహెచ్ యస్ లుగా మీమీ బాధ్యతలకు పూర్తి న్యాయం చేయాల‌ని, డిసిహెచ్ యస్ ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని మంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించడం వ‌ల్ల వాస్త‌వ ప‌రిస్థితుల్ని తెసుకోగ‌లుగుతార‌న్నారు. సమయపాలన పాటించ‌ని డాక్ట‌ర్ల విష‌యంలో ఉపేక్షించేదిలేద‌న్నారు. వ్యక్తిగత విషయాలకంటే లోగులకు సేవకు ప్రాధాన్యతనివ్వాలని, ఆర్థికాభివృద్ధికి ఆరోగ్యమే ప్రధానమనే విష‌యాన్ని గ్రహించాలని, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునే దిశగా అంకిత భావంతో పనిచేయాలని మంత్రి తెలిపారు. సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లను బాగా తగ్గించాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల్లో డిసిహెచ్‌య‌స్‌ల ఆధ్వ‌ర్యంలోని జిల్లా, ప్రాంతీయ‌, సామాజిక ఆసుప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాలు లేక‌పోవ‌డం, హాజ‌రు ప‌ర్య‌వేక్ష‌ణా యంత్రాంగం లేక‌పోవ‌డం, డ‌యాగ్నోస్టిక్ సేవ‌ల ల‌భ్య‌త‌, స‌రైన ఆడిట్ లేక‌పోవ‌డం, జిల్లా స్థాయిల్లో లోపాలు, కొర‌త‌ల్ని గుర్తించ‌లేక‌పోవ‌డం వ‌ల్ల వీటిని స‌రిచేసేందుకు శిక్ష‌ణా కార్య‌క్ర‌మం అవ‌ర‌మ‌ని భావించామ‌న్నారు. స‌రైన ఓరియంటేష‌న్ ఇవ్వ‌గ‌లిగితే వ్య‌వ‌స్థ‌ను స‌రిచేయ‌వ‌చ్చ‌నేది ముఖ్యోద్దేశ‌మ‌న్నారు. కింది స్థాయి నుండి పైస్థాయి వ‌ర‌కు వైద్య సేవ‌ల్ని గాడిన పెట్టాల‌న్నారు. సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, ప్రిఆథ‌రైజేష‌న్లు పెంచాల‌ని మంత్రి ఆదేశించారు. గ‌తేడాది జూన్‌లో 15 శాత‌మున్న ప్రిఆథ‌రైజేష‌న్లు ఈ ఏడాది జూన్ నాటికి 24 శాతానికి పెరిగాయ‌ని, దీన్ని 80 శాతానికి పెంచేందుకు కృషి చేయాల‌న్నారు. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో 80 నుంచి 90 శాతం మేర ప్రిఆథ‌రైజేష‌న్లు జ‌రుగుతున్నాయ‌ని, సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో కూడా ఇదే స్థాయిలో జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్రిఆథ‌రైజేష‌న్ల విష‌యంలో సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్‌, డిసిహెచ్‌య‌స్‌లు సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. అలాగే సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో 41 శాతం మేర సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు న‌మోద‌య్యాయ‌ని, వీటిని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకొచ్చిన ఏడాదిలో సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాల్ని ఆశించిన మేర క‌ల్పించామ‌ని, 90 ఆసుప‌త్రుల్లో అల్ట్రా సోనోగ్ర‌ఫీ(యుఎస్‌జి) స‌ర్వీసుల్ని క‌ల్పించామ‌ని, 149 ఎక్స్‌రే యంత్రాల్ని ఏర్పాటు చేశామ‌ని, 89 ఆసుప‌త్రుల్లో టెలీరేడియాల‌జీ స‌ర్వీసుల్ని క‌ల్పించామ‌ని, 20 కొత్త డ‌యాల‌సిస్ సెంట‌ర్ల‌ను నెల‌కొల్పామ‌ని మంత్రి తెలిపారు. 13 కొత్త ఇంటిగ్రేటెడ్ ప‌బ్లిక్ హెల్త్ ల్యాబ‌రెట‌రీల‌ను(ఐపిహెచ్ ఎల్‌) ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌తి ఐపిహెచ్ ఎల్ ల్యాబ్‌లో 139 డ‌యాగ్న‌స్టిక్ టెస్టులు చేస్తున్నార‌ని మంత్రి చెప్పారు. దాదాపు 15,000 మంది డాక్ట‌ర్లు ప్ర‌జారోగ్య రంగంలో సేవ‌లందిస్తున్నార‌ని, వీరిలో డిఎంహెచ్వోలు, డిసిహెచ్‌య‌స్‌లు, స్టేట్ నోడ‌ల్ ఆఫీస‌ర్లు ఉన్నార‌ని, పాల‌నాప‌ర‌మైన బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న వారు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్ని పెంపొందించుకోవాల‌ని మంత్రి సూచించారు. కూట‌మి ప్ర‌భుత్వ‌మేర్ప‌డిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు ఐవిఆర్‌య‌స్ విధానాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో సేవ‌ల‌పై ప్ర‌జాభిప్రాయాల్ని తెలుసుకునే వీలు క‌లిగింద‌న్నారు. 61 శాతం నుండి 40 శాతానికి అవినీతి త‌గ్గింద‌ని ఐవిఆర్‌య‌స్ ద్వారా తెలిసింద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ప్ర‌జారోగ్య రంగంలో ప్ర‌జ‌ల్లో విశ్వాసాన్ని క‌లిగించ‌గ‌లిగామ‌న్నారు. గ‌తంలో సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో 60 శాతం హాజ‌రు జాతం ఉండేద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకొచ్చాక ఇది 84 శాతానికి పెరిగింద‌ని, దీన్ని 95 శాతానికి పెంచ‌గ‌లిగితే పూర్తి స్థాయిలో సేవ‌లందించిన‌వార‌మ‌వుతామ‌ని మంత్రి తెలిపారు. 242 సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో వివిధ స్థాయిల్లో 12,779 సిబ్బంది ఉండాల్సి ఉండ‌గా, 1,803 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఏడాదిలో 462 మంది డాక్ట‌ర్ల‌ను నియ‌మించామ‌ని మంత్రి తెలిపారు. 2024-25లో 2.41 కోట్ల మేర ఓపీ సేవ‌లు న‌మోద‌య్యాయ‌ని, అంటే రోజుకు ఒక ల‌క్ష ఓపీ సేవ‌లు న‌మోద‌య్యాయ‌ని మంత్రి తెలిపారు. 2047 నాటికి స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ డాక్ట‌ర్లు భాగ‌స్వాముల‌వ్వాల‌ని, ఇందుకోసం అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల‌ని మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ కోరారు. సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ.సిరి, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-