అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు సహకరించండి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు సహకరించండి
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవ్‌గణ్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ని అజయ్ దేవ్‌గణ్ కలిసి ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవ్‌గణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజయ్ దేవ్‌గణ్ తెలియజేశారు.
Comments