రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నెల్లూరు రొట్టెల పండగ విశేషాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

 నెల్లూరు రొట్టెల పండగ విశేషాలు

  • 10వ తేదీ వరకు ఉత్సవాలు
  • షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం
  • లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
  • నెల్లూరు, (పీపుల్స్ మోటివేషన్):-

నెల్లూరు రొట్టెల పండుగ ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల పదో తేదీ వరకు(ఐదు రోజులు) ఉత్సవాలు కొనసాగనున్నాయి.

రొట్టెల పండుగ ఎలా ప్రారంభమైందంటే..

నెల్లూరులో బారా షాహిద్ దర్గా నిర్మించినప్పటి నుంచి ముస్లింలు మొహర్రం రోజున సమావేశమై మరుసటి రోజు ఒకరితో ఒకరు రోటీలు పంచుకునే వారు. కాలాక్రమేణా దర్గాలో రోటీలు పంచుకోవడం వల్ల దాత, స్వీకరించే వారికి ఇద్దరికీ శుభం కలుగుతుందనే ప్రచారం జరిగింది. భక్తికి చిహ్నంగా, ఆర్కాట్ నవాబు సాధతుల్లా ఖాన్ రాణి బేగం సాయబా దంపతులు ఇద్దరు కలిసి స్థానిక ముస్లింలకు, హిందువులకు రోటీలను పంచిపెట్టారు. అప్పటి నుంచి ముస్లింలు, హిందువులు రోటీలు పంచుకుంటున్న సంప్రదాయాన్ని కొనసాగించడానికి మొహర్రం నెల 12వ రోజున దర్గా వద్ద గుమ్మి గుడేవారు. ఈ రోటీల మార్పిడి దర్గా సమీపంలో ఉన్న స్వర్ణాల చెరువు దగ్గర జరుగుతుంది.

రాష్ట్ర పండుగగా గుర్తింపు

రొట్టెల పండుగకు ఉన్న జనాదరణ, ఘనమైన చరిత్ర, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రొట్టెల పండగను ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది. పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధులు కేటాయించి ఏర్పాట్లు చేశారు. 2024 సంవత్సరంలో పండుగ నిర్వహణతో పాటు, ఇతర మరమ్మతుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు అప్పటి(ఇప్పటి కూడా) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. బారాషాహీద్ దర్గా, రొట్టెల పండగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాక వేరే రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 


నెల్లూరు బారాషాహీద్ దర్గా చరిత్ర ఇదీ

ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలంలో 2,500 వేలమంది సూఫీలు (మత గురు వుల) ఇస్లాం మహా సూక్తులను, మహమ్మద్ ప్రవక్త సూచించిన ఐదు సూత్రాలను మానవాళికి తెలియజేయడం కోసం భారతదేశానికి వచ్చారు. వారిలో 12 మంది సూఫీలు"టర్కీ నుండి వచ్చారు. ఈ 12 మంది సూఫీలు దక్షిణ భారతదేశంలో సందర్శిస్తూ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని "గంధవరం" ఆ కాలంలో తెలుగు ప్రాంతాలను"కాకతీయులు పరిపాలిస్తున్నారు. ప్రస్తుత నెల్లూరు (విక్రమ సింహపురి) ప్రాంతాలను కాకతీయుల సామంత రాజులు, 12 మంది సూఫీలకు ప్రస్తుత నెల్లూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న"గంధవరం (గండవరం) వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో సామంత రాజుల చేతిలో అమరులయ్యారు. 12 మంది సూఫీలు శిరచ్చేదనానికి గురయ్యారు. సూఫీల తలలు లేని మృతదేహాలను వారు యుద్ధానికి ఎక్కిన గుర్రాల పైనే నెల్లూరుకు తిరిగివచ్చి ప్రస్తుతం దర్గా ఉన్న ప్రదేశంలో"స్వర్ణాల చెరువు గట్టున భూమిలో ఖననం చేసారు. 

క్రీస్తు శకం 1740 సంవత్సరములు నెల్లూరు, ఉదయగిరి, ఆర్కాట్ ప్రాంతాలను ఆర్కాట్ నవాబు"సాధతుల్లా ఖాన్"పరిపాలనా కాలంలో ఆర్కాట్ నవాబు కుటుంబ సభ్యులు తమిళనాడులోని ఆర్కాట్ నుండి ఉదయగిరి కి ప్రయాణించే సమయంలో మార్గమధ్యలో ప్రస్తుతం నెల్లూరు స్వర్ణాల చెరువు గట్టున ఆర్కాట్ నవాబు కుటుంబ సభ్యులు వారి సైనిక పరివారము గుడారాలు వేసుకుని బస చేసారు. తెల్లవారే సరికి "ఆర్కాట్ నవాబు సాధతుల్లా ఖాన్, భార్య రాణి బేగం సాహెబా నమాజు కోసము స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్లి "వజూ"చేసి వస్తుండగా రాణి బేగం సాహెబ్ కాలి బొటన వేలికి రాయి తగిలి గాయమైంది. తరువాత కొన్ని సంవత్సరాలకు బేగం సాహెబా కాలి వేలికి తగిలిన గాయం ఎంతమంది ఆస్థాన వైద్యులు ఎంత వైద్యం చేసినా గాయం మానలేదు. కొన్ని నెలలకు బేగం సాహెబా ఆరోగ్యం క్షీణించడంతో ఆర్కాట్ నవాబు తన ఆస్థానంలోని జ్యోతిష్యులను సంప్రదించగా వారు దివ్య దృష్టితో చూసి ఈ కుటుంబ సభ్యులు ఉదయగిరి ప్రాంతానికి ప్రయాణించే సమయంలో మీరు బసచేసిన ఆ చెరువు గట్టున వెళ్లి ఆ ప్రదేశంలో తవ్వి చూడండి అని ఆస్థాన జ్యోతిష్యులు నవాబుకు వెల్లడించారు. కొంతమంది సైనిక బలగంతో వెళ్లి స్వర్ణాల చెరువు గట్టున ప్రస్తుతం దర్గా ఉండే ప్రదేశంలో తవ్వి చూడగా, తలలు లేని 12 మంది సూఫీల మృతదేహాలు పూర్వం ఎలా ఉండేవో అలానే తాజాగా మృతదేహాలు బయటపడ్డాయి. తర్వాత ఆర్కాట్ నవాబు 12 మంది అమరులైన సూఫీల మృతదేహాలతో దర్గా నిర్మించాలని ఆస్థాన ఇస్లాం మత గురువులు చెప్పడంతో ఆర్కాట్ నవాబు సాధతుల్లా ఖాన్ క్రీస్తుశకం 1756 సంవత్సరంలో ఒక సుందరమైన దర్గాను నిర్మించి దర్గా లోపల అమరవీరులైన వారికి గుర్తుగా ఒక విజయ స్తంభం నిర్మించారు.

అమరులైన 12 మంది సూఫీల గౌరవార్థం"బారా షహీద్ దర్గాగా ప్రసిద్ధి చెందింది. వారి త్యాగానికి గుర్తుగా దర్గా నిర్మించారు. మందిరానికి"బారాషాహీద్ దర్గా అని పేరు పెట్టారు."బారా"అంటే 12 అని అర్థం, "షాహిద్"అంటే అమరవీరులను సూచిస్తుంది. ఆర్కాట్ నవాబు సాధతుల్లా ఖాన్ భార్య బేగం సాహెబా ఈ 12 మంది సూఫీల సమాధుల వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత తీవ్రమైన అనారోగ్యం నుండి కోలూకున్నారు. తర్వాత స్వర్ణాల చెరువు దగ్గర పేదలకు మతాలకతీతంగా రొట్టెలను బెల్లంతో కలిపి పంచిపెట్టడంతో అప్పటి నుంచి విశ్వాసుల కోరికలను తీర్చడంలో"యోధుల సామర్థ్యం గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది.

Comments

-Advertisement-