రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏవియేషన్ హాబ్ గా ఆంధ్రప్రదేశ్.. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆకాంక్ష

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఏవియేషన్ హాబ్ గా ఆంధ్రప్రదేశ్.. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆకాంక్ష

•మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కృషితో ఏవియేషన్ రంగంలో కీలక పెట్టుబడులు

•రాష్ట్రానికి రానున్న 9 ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్, 2 ప్లైట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు

•ఆంధ్రప్రదేశ్ కు ఏవియేషన్ రంగంలో పెట్టుబడుల వెల్లువ

•రాష్ట్రానికి సుస్థిరమైన, నమ్మకమైన పెట్టుబడులు రాక

•పెట్టుబడుల రాకతో నిరుద్యోగ యువతకు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన

•రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావారణంతోనే ఇది సాధ్యం..

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ “ఏవియేషన్ హాబ్” గా మారబోతుందని.. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.. నేడు సచివాలయంలోని ఆర్ & బీ శాఖా కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని పలువురు పెట్టుబడుదారులు, పారిశ్రామికవేత్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 సంస్థలు తమ ఆసక్తిని మంత్రికి తెలియజేయడం జరిగింది...

రాష్ట్రంలో గతేడాది కాలంలో విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడిందని.. దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతుందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. ముఖ్యంగా నేడు దేశంలో ప్రముఖ ఏవియేషన్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.. నేడు ఆయా ఏవియేషన్ సంస్థల ప్రతినిధులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఏవియేషన్ సంస్థలు సుముఖత తెలపడం జరిగింది... ఈ సందర్భంగా ఆయా సంస్థల ఆలోచనలు, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన సమగ్ర నివేదికను మంత్రికి అందజేయడం జరిగింది.. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే, రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని ఆ సంస్థ ప్రతినిథులకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.

రూ. 600 కోట్ల పెట్టుబడులకు స్కై బర్డ్ ఏవియేషన్ ప్రవేట్ లిమిటెడ్ సుముఖత

నేడు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డితో జరిగిన సమావేశంలో స్కై బర్డ్ ఏవియేషన్ ప్రవేట్ లిమిటెడ్ (Skybird aviation Private limited) సంస్థ రూ. 600 కోట్లతో పుల్ ప్లైట్ సిమ్యులేషన్ సెంటర్ (Full Flight Simulation Center ) ఏర్పాటుకు ఆసక్తిని కనబర్చడం జరిగింది.. 

రూ. 210 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ టీ ఓ & హెలీ టాక్సీ సర్వీసెస్ సంస్థ ఆసక్తి

అలాగే ఎఫ్ టీ ఓ & హెలీ టాక్సీ సర్వీసెస్ సంస్థ (FTO & Heli Taxi Services ) రూ. 210 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 

ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు ఫెలిక్స్ ఏవియేషన్ అకాడమీ ఆసక్తి..

రాష్ట్రంలో ఔత్సాహిక యువతకు ఫైలెట్ లుగా శిక్షణ ఇవ్వడానికి ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) ఏర్పాటు చేయడానికి పెలిక్సీ ఏవియేషన్ అకాడమీ (Felix Aviation Academy) తమ ఆసక్తిని వ్యక్తం చేయడం జరిగింది.. 

రాష్ట్రానికి క్యూ కడుతున్న ఏవియేషన్ రంగంలో అగ్రగామి సంస్థలు

ఏవియేషన్ రంగంలో అపార అనుభవం ఉన్న ఇటువంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం నిజంగానే ఆంధ్రప్రదేశ్ కు శుభపరిణామమన్నారు.. ఇప్పటికే ఈప్లెన్ కంపెనీ (EPlane Company), బ్లూజే ఏవియేషన్ (BLUJ Aviation), మరియు మాగ్నమ్ వింగ్స్ (Magnum Wings), సరళ ఏవియేషన్ (Sarla Aviation) సంస్థ, గోల్డెన్ ఎప్యూలెట్స్ ఏవియేషన్ అకాడమీ సంస్థ (Golden Epaulettes Aviation Pvt Ltd), హరిబన్ ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Haribon Aeronautics Private Limited) వంటి ప్రముఖ EVTOL సంస్థలు... మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబర్చడమే కాదు, గతంలో మంత్రిని స్వయంగా కలిసి వారి ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలు తెలియజేయడం జరిగింది.. ఈ క్రమంలో నేడు తాజాగా రాష్ట్రంలో స్కై బర్డ్ ఏవియేషన్ ప్రవేట్ లిమిటెడ్, పెలిక్సీ ఏవియేషన్ అకాడమీ, ఎఫ్ టీ ఓ & హెలీ టాక్సీ సర్వీసెస్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ పరిణామం.... మొత్తంగా రాష్ట్రంలో ఏవియేషన్ రంగంలో 9 ప్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ (FTO) సంస్థలు, 2 ప్లైట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, 5 ఈవీ టోల్స్ కంపెనీలు, 2 ఎమ్ ఆర్ ఓ (MRO), 3 సిమ్యులేషన్స్ సెంటర్లు రానున్నాయి...

మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో పెట్టుబడులు వరద

రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో సుస్థిరమైన, నమ్మకమైన కంపెనీలు సంస్థలు, పరిశ్రమలు, భారీగా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి క్యూ కట్టడం, తద్వారా స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా నిరుద్యోగానికి అడ్డుకట్ట వేయగలమనేది మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి విశ్వాసం.... దీని కోసం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, రైల్వే, ఎయిర్ పోర్టులు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థలతో అనునిత్యం ప్రత్యేకంగా చర్చలు జరపడం జరుగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పూర్తిగా దిగజార్చిన క్రమంలో.. నేడు పెట్టుబడిదారుల్లో సడలిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టి, వారికి భరోసా కల్పించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఏర్పడింది... 

సుస్థిర ప్రభుత్వం, బలమైన నాయకత్వంలోనే నిరంతరాయ అభివృద్ధి, నమ్మకమైన పెట్టుబడులు సాధ్యం

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్ ను ఉపయోగించుకుంటూ.. పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేయడంతో పాటు, ఇన్వెస్టర్ లకు తిరిగి రాష్ట్రంపై నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో వచ్చే ప్రతీ రూపాయి పెట్టుబడి ద్వారా.. స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో అగ్రతాంబూలం వేసే విధంగా ఒక నిర్ధిష్ట కార్యచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.. అదే సమయంలో భవిష్యత్తు తరాల భవితకు ఉపయోగపడేలా సుస్థిరమైన, నమ్మకమైన పెట్టుబడులు పెట్టే సంస్థలకు మెరుగైన రాయితీలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు.. సహజంగా పెట్టుబడిదారులు ధీర్ఘకాలికంగా బలమైన ప్రభుత్వం, చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఉన్న ప్రాంతాల్లో తమ పెట్టుబడులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటాయి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తి కాకుండానే, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కనిపిస్తోంది.. ఈ నేపథ్యంలో సమాకాలీక రాష్ట్రాలతో పోటీ పడలన్నా, పెట్టుబడులు రాకతో పాటు, పారిశ్రామికాభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలన్నా.. అది మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యం.. కాబట్టి రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం తపించే.. కూటమి ప్రభుత్వం ధీర్ఘకాలం పాటు అధికారంలో ఉండటం ద్వారా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బలమైన ముద్ర వేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహాం లేదు....

Comments

-Advertisement-