కుప్పంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు
కుప్పంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు
- 30కి పైగా ఉపాధి కల్పన కంపెనీలు పాల్గొన్నాయి
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
- నియోజవర్గంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశ కల్పనే లక్ష్యం
- ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
- 300 మంది పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది
- ఉద్యోగం చిన్నదైన పెద్దదైన ఆత్మ ధైర్యంతో పనిచేయాలి
- కడ పిడి వికాస్ మర్మత్
కుప్పం, జూలై 22: కుప్పంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు అందనున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
మంగళవారం కుప్పంలోని కడ కార్యాలయంలో మేగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్, సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడాపిడి వికాస్ మర్మత్ లతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... కుప్పంలో ఇటీవల ఉపాధి కల్పనపై కేంద్రీకృతంగా చర్యలు తీసుకుంటూ, స్థానిక యువతకు అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ మేళాలు నిర్వహించబడుతున్నాయని, ఈ చర్యలు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకుదోహదపడుతుందన్నారు.ఈ జాబ్ మేళాకు జూలై 21, 2025న ముందస్తు స్క్రీనింగ్ మరియు రిజిస్ట్రేషన్ పూర్తయిందని, జూలై 22న ఇంటర్వ్యూలు నిర్వహించబడనున్నాయని, ఈ జాబ్ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి 500కి పైగా ఖాళీలు వివిధ అర్హతలతో ఉన్న అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ జాబ్ మేళాకు పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ చదివిన వారు అర్హులని, ఉద్యోగం పొందిన వారికి ₹14,000 నుండి ₹60,000వరకువేతనంఇవ్వనున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్మాట్లాడుతూ... కుప్పం నియోజకవర్గంలోనియువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రథమ లక్ష్యంతో,నిరుద్యోగయువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.
కడ పిడి మాట్లాడుతూ... కుప్పం నియోజకవర్గం నందు 300 మంది పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, మీరు చేసే ఉద్యోగం చిన్నదైన పెద్దదైన ఆత్మ ధైర్యంతో పనిచేయాలని యువతకు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
APSRTC వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం , డా. సురేష్ బాబు , రాజ్ కుమార్ , ప్రముఖ కంపెనీ HR ప్రతినిధులు, కడ అడ్వైసరీ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు ముఖ్య అథితులుగా హాజరయ్యారు.