ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సంతృప్తి చెందేలా సక్రమంగా అమలు చేయాలి
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సంతృప్తి చెందేలా సక్రమంగా అమలు చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సంతృప్తి చెందేలా సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, స్వయం సహాయక సంఘాల మైక్రో క్రెడిట్ ప్లాన్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీ ఎస్ మాట్లాడుతూ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ వంద శాతం సంతృప్తి గా ఉండేలా అన్న క్యాంటీన్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించుకుని పరిశుభ్రమైన ఆహారము అందించే చర్యలు తీసుకోవాలని, అన్న క్యాంటీన్ పరిసరాలలో పరిశుభ్రత గా ఉంచాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో,మున్సిపాలిటీల్లో శాఖ పారిశుద్య చేపట్టాలని ఆదేశించారు..మహిళలపై వేధింపులు, నేరాలు జరక్కుండా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
డిస్టిక్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు..కీ పర్ఫామెన్స్ ఇండికేటర్లు అమలు చేసి ప్రతి సంవత్సరము 15% అభివృద్ధి సాధించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 15 లోగా నిర్దేశించిన విధంగా బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునే లాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు ద్వారా కిచెన్ గార్డెన్స్, ఆక్వా కల్టివేషన్, బ్యాంబు కల్టివేషన్ మరియు మహిళ మార్ట్ ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల లో మందులను సమకూర్చుకోవాలని, కాలువలు సిల్ట్ తో నిండిపోకుండా వెంటనే శుభ్రం చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలని అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశుభ్రపరచుకొని బ్లీచింగ్ పౌడర్లు వాడాలని సూచించారు.
బాలింతలు ,గర్భిణీ స్త్రీలు లకు ఇచ్చే టేక్ హోమ్ రేషన్ లకు సంబంధించిన ఈకేవైసీ అందరికీ వెంటనే చేయించాలని, వీరికి ఫేస్ రికగ్నిషన్ ద్వారా టేక్ హోమ్ రేషన్లను అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్- 19 ద్వారా మరణానికి గురైన తల్లిదండ్రుల పిల్లలకు ఇవ్వవలసిన పరిహారం అందించే చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు.500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ల ఏర్పాట్లకు కావలసిన భూములను సేకరించాలని ఆదేశించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, పిఎం కుసుమ్ ప్రాజెక్టుల కొరకు ఇవ్వవలసిన స్థలాలను వెంటనే అందజేసే చర్యలు తీసుకోవాలని మరియు పి యం సూర్యఘర్ ల ను లబ్ధిదారులకు వెంటనే అందజేసే చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఇంచార్జి కలెక్టర్ డా. బి. నవ్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, సిపిఓ హిమప్రభాకర్ రాజు, డిఆర్డిఎ పిడి రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.