రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Sigachi Chemical: పాశమైలారం ఘోర ప్రమాదం... సుమోటోగా స్వీకరించిన హ్యూమన్ రైట్స్ కమిషన్

Sigachi Chemical Sangareddy Pashamylaram Human Rights Commission Factory Accident Industrial Accident Telangana NHRC HRC Fire Accident
Mounikadesk

 Sigachi Chemical: పాశమైలారం ఘోర ప్రమాదం... సుమోటోగా స్వీకరించిన హ్యూమన్ రైట్స్ కమిషన్

  • సిగాచి ప్రమాదంపై హెచ్‌ఆర్‌సీ సుమోటో..
  • జులై 30లోగా నివేదికకు ఆదేశం..
  • పాశమైలారం ఘటనపై ఫిర్యాదుల వెల్లువ..


సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు నమోదు చేయగా, మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సైతం ఫిర్యాదులు అందాయి. బాధితులకు న్యాయం చేయాలని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రమాద ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, దీనిని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, జులై 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, ఈ ఘటనపై రామారావు అనే వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. సిగాచి పరిశ్రమ డైరెక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని ఆయన కమిషన్‌ను కోరారు. దీంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదే ఘటనపై న్యాయవాది కుమారస్వామి సైతం రాష్ట్ర హెచ్‌ఆర్‌సీకి మరో ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో పాత యంత్రాలను వినియోగించడం, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడమే ప్రమాదానికి ప్రధాన కారణాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిగాచి కెమికల్ పరిశ్రమ యాజమాన్యంపైనా, సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీలకు ముందుజాగ్రత్త చర్యలపై ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వరుస ఫిర్యాదులు, హెచ్‌ఆర్‌సీ స్పందనతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.



Comments

-Advertisement-