లోక్సభలో జన్ విశ్వాస్ బిల్లు 2.0 ప్రవేశం చిన్న నేరాలకు జైలు శిక్షల బదులు జరిమానాలు..
లోక్సభలో జన్ విశ్వాస్ బిల్లు 2.0 ప్రవేశం చిన్న నేరాలకు జైలు శిక్షల బదులు జరిమానాలు..
చిన్న చిన్న నేరాలకు జైలు శిక్షల నుంచి ఉపశమనం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం జన్ విశ్వాస్ బిల్లు 2.0 (Jan Vishwas Bill 2.0) ను లోక్సభలో ప్రవేశ పెట్టింది. దేశంలో వ్యాపారం, జీవనం మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు.
బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశాలు:
నేరరహితం(Decriminalization): చిన్నపాటి నేరాలను, సాంకేతిక తప్పిదాలను జైలు శిక్షార్హం కాకుండా చేయడం. బదులుగా, ఈ తప్పిదాలకు జరిమానాలు లేదా ఇతర పరిపాలనా చర్యలు విధించడం.
వ్యాపార సౌలభ్యం: చిన్న పొరపాట్లకు కూడా జైలు శిక్ష పడుతుందనే భయాన్ని తొలగించడం ద్వారా వ్యాపారాలు సులభంగా నిర్వహించుకోవడానికి ఈ బిల్లు సహాయపడుతుంది.
న్యాయ వ్యవస్థపై భారం తగ్గింపు: చిన్న కేసుల వల్ల కోర్టులపై పడే భారాన్ని తగ్గించి, ముఖ్యమైన కేసుల విచారణకు ప్రాధాన్యత ఇవ్వడం. దీనివల్ల న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
పౌరులు, వ్యాపారాలలో విశ్వాసం పెంపు: చట్టపరమైన ప్రక్రియలను సరళీకృతం చేసి, ప్రభుత్వం మరియు పౌరుల మధ్య నమ్మకాన్ని పెంచడం.
మొదటిసారి ఉల్లంఘనలకు హెచ్చరికలు: మొదటిసారి నిబంధనలను ఉల్లంఘించినవారికి నేరుగా శిక్ష బదులుగా, మొదట సూచనలు మరియు హెచ్చరికలు జారీ చేయడం.
బిల్లులో ప్రతిపాదించిన సంస్కరణలు:
నేరాల తొలగింపు: ఈ బిల్లు ద్వారా సుమారు 288 చిన్న నేరాలను తొలగించాలని ప్రతిపాదించారు. గతంలో, 2023లో ప్రవేశ పెట్టిన బిల్లు ద్వారా 183 నేరాలను తొలగించారు.
ఈ బిల్లు 10 మంత్రిత్వ శాఖలకు చెందిన 16 కేంద్ర చట్టాలలో మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పుల ద్వారా చిన్న చిన్న నేరాలను నేరరహితం (decriminalize) చేసి, జైలు శిక్షల బదులు జరిమానాలను విధించడం దీని ప్రధాన ఉద్దేశం.
ఈ బిల్లు ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన చట్టాలు:
మోటారు వాహనాల చట్టం1988 (Motor Vehicles Act, 1988): ఈ చట్టంలో కొన్ని నిబంధనలు ఉల్లంఘనలకు జైలు శిక్ష బదులుగా జరిమానాలు విధించడం.
తూనికల కొలత చట్టం, 2009 (Legal Metrology Act, 2009): 5, సంబంధించిన చిన్నపాటి తప్పులకు కూడా శిక్షలు తొలగించి జరిమానాలు మాత్రమే విధించడం.
ఔషధాలు-సౌందర్య ఉత్పత్తుల చట్టం, 1940 (Drugs and Cosmetics Act, 1940): ఈ చట్టంలోని కొన్ని నిబంధనల ఉల్లంఘనలకు నేరాల స్థాయిని తగ్గించడం.
సెలెక్ట్ కమిటీకి నివేదన: బిల్లుపై సమగ్ర పరిశీలన కోసం దానిని లోక్సభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. కమిటీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటి రోజున సమర్పించాల్సి ఉంటుంది.