ఉన్నత స్థానంలో సహకారం అందించటమే పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం
ఉన్నత స్థానంలో సహకారం అందించటమే పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం
మంగళగిరిలోని సీకే కన్వేన్షన్ లో మంగళవారం జరిగిన ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజలు భాగస్వామ్య (పీ4) కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, ఏపీ ఎన్ఆర్టీ ఆధ్యక్షులు వేమూరి రవి, 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, మహహ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ తేజ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమం ద్వారా లబ్ధి పోందిన బంగారు కుటుంబాల సభ్యులు, చేయుత అందించిన మార్గదర్శులతో మాట్లాడి వారు ఆర్ధికంగా ఎదుగుతున్న విధానం గురించి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గం కు సంబంధించి 250 బంగారు కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శిగా ఉంటూ వేదికపై ఏర్పాటు చేసిన అడాప్షన్ ట్రీ వద్ద వారిని దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబాలను, మార్గదర్శులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు.
స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించటానికి అట్టడుగున ఉన్న కుటుంబాలకు, ఉన్నత స్థాయిలో ఉన్న వారు దత్తత తీసుకొని అవసరమైన సహకారం అందించటమే ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజలు భాగస్వామ్యం పీ4 కార్యక్రమం అన్నారు. ఇది పూర్తిగా స్వఛ్చంధ కార్యక్రమం అని సమాజంలో ప్రజలకు తమ వంతు సహకారం అందించాలని ఉన్నత స్థాయిలో ఉన్న వారు పేద కుటుంబాలను దత్తత తీసుకోవటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2.70 లక్షలు ఉందని, కానీ దీనిలో ఉన్నత స్థాయిలో పది శాతం మందిని మినహాయిస్తే రూ.1.50 లక్షలు మాత్రమే ఉంటుందని, 20 శాతం మందిని మినహాయిస్తే 80 శాతం మంది తలసరి ఆదాయం దాదాపు లక్ష రుపాయిలు మాత్రమే ఉంటుందన్నారు. సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్ధికంగా ముందున్న వ్యక్తులు తిరిగి సమాజానికి తమవంతు సహకారం అందించి పేద కుటుంబాలకు సహాయం చేయటం ద్వారా హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించవచ్చన్నారు. పీ4 కార్యక్రమంలో కేవలం ఆర్ధికంగా సహాయం అందించటమే కాకుండా నైపుణ్యాల అభివృద్ధికి, విద్యా, వైద్య, వృత్తి నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలను అందించి బంగారు కుటుంబాల ఆర్ధిక అభివృద్ది సాధించేలా మార్గదర్శులు సహాయం అందించవచ్చన్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం తరహాలోనే పీ4 మంచి సత్ఫలితాలను అందింస్తుందన్నారు. విజన్ తో ఇతరుల్లో స్పూర్తిని నింపే మంచి గ్రేట్ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అవగాహన లేక పీ4 కార్యక్రమాన్ని అవహేళన చేసిన వారి చరిత్ర హీనులు అవుతారని, సమర్ధించిన వారు చరిత్రను సృష్టిస్తారన్నారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది రోజు ప్రారంభించిన పీ4 కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా మరింత ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. జాతీయ స్థాయిలో గౌరవ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది సూత్రాలను అమలు చేయటం జరుగుతుందన్నారు. దీనిలో ముఖ్యమైన జీరో పావర్టీ సాధనలో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మందిని బంగారు కుటుంబాలుగా, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది మార్గదర్శులుగా ఉండి సహకారం అందించటమే పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాలను సర్వే చేసి వారిలో ఆర్దికంగా అట్టడుగున దాదాపు 30 లక్షల కుటుంబాలను గుర్తించటం జరిగిందని, వీరిలో మరింత నిరుపేదలు 2.5 లక్షలు ఉన్నారన్నారు. బంగారు కుటుంబాలుగా గుర్తించి వారికి కావాల్సిన అవసరాలపై సర్వే నిర్వహించటం జరిగిందన్నారు. సహాయం చేయాలన్నా అలోచన ఉన్న వ్యక్తులకు పీ4 కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సహకారం అవసరమైన బంగారు కుటుంబాల దత్తత పై పూర్తి సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పి4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం, లక్ష్యాలను పీయూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.