టాప్ - 6 లో జిల్లా ఉండాలి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
టాప్ - 6 లో జిల్లా ఉండాలి
- అన్న క్యాంటీన్లలో, మున్సిపాలిటీలలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి
- అన్ని చెరువులకు నీరందించేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలి
- అధిక ధరలకు యూరియా అమ్మితే చర్యలు తీసుకోవాలి
- వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, ఆగస్టు 29 :
- అన్న క్యాంటీన్లలో, మున్సిపాలిటీలలో పరిశుభ్రత, ఇతర అంశాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలో టాప్ -6 లో ఉండేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, మున్సిపాలిటీలలో శానిటేషన్, ఇరిగేషన్, ఐసిడిఎస్, యూరియా, విద్యుత్ శాఖ, ఏపీఐఐసి భూ సమస్యలు, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడిఓలు, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ, ఐసిడిఎస్, తదితర శాఖల మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల అమలులో రాష్ట్రంలో అనంతపురం జిల్లా 4వ స్థానంలో నిలవడం పట్ల మున్సిపల్ కమిషనర్లకు అభినందనలు తెలిపారు. అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాణ్యత మరింత పెంచాలన్నారు. సానుకూల ప్రజా అవగాహనకు సంబంధించి మున్సిపల్ సేవల పరిధిలో రోజు ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారా, మీ పరిధిలో చెత్తకుప్పలను 24 గంటలలోపు తొలగిస్తున్నారా లేదా, మున్సిపాలిటీలో డ్రైనేజీలు పరిశుభ్రం చేస్తున్నారా అన్న అంశాలకు సంబంధించి మరింత పురోగతి చూపించాలని, పరిశుభ్రతపై మున్సిపల్ కమిషనర్లు పరిశీలన చేయాలన్నారు. రోజు ఇంటి నుంచి చెత్త సేకరించాలని, డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ అంశంలో జిల్లా రాష్ట్రంలో టాప్ 6 లో ఉండేలా పనిచేయాలన్నారు. ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, అన్ని విధాల సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో 304 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉండగా, ప్రతి చెరువులకు నీరు నింపేలా, భూగర్భజలం పెంచేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. వచ్చే వారం రోజుల్లో 50 చెరువులకు నీరు నింపేలా చూడాలని మైనర్ ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని దానిని కొనసాగించాలని, రైతు సేవ కేంద్రాలు, డిసిఎంఎస్ లలో అవసరమైన చోట ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతు సేవ కేంద్రాలలో, ప్రైవేట్ చోట ఎరువుల అమ్మకాలపై విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు మానిటర్ చేయాలన్నారు. ఎరువుల అమ్మకాలను రికార్డ్ చేస్తున్నారా లేదా అనేది చూడాలని, ఎక్కడైనా ఎరువుల నిల్వ అయిపోతే వెంటనే తెలియజేయాలన్నారు. ఒక హెక్టార్ కు ఎంత ఎరువులు కావాలి అనేది రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ తోపాటు తాము కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం జరుగుతుందని, అధిక ధరలకు యూరియా అమ్మితే చర్యలు తీసుకోవాలన్నారు.
- జిల్లాలో 21 సబ్ స్టేషన్ లో ఉండగా, వాటి చుట్టూ భూమి తీసుకుని సోలార్ ప్లాంట్లు పెట్టి గ్రీన్ ఎనర్జీని జనరేట్ చేయడం కోసం పీఎం కుసుమ్ కింద 111 మెగావాట్ల సోలార్ జనరేషన్ కోసం అవసరమైన 499.5 ఎకరాలకు సంబంధించిన భూమి అవసరమవుతుందని, ఇందుకు సంబంధించి ప్రైవేట్ భూమిని రైతుల దగ్గర కొంటామని కంపెనీ వారు చెబుతున్నారని, ఇందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో తాము కూడా ఒక సబ్ స్టేషన్ తనిఖీ చేయడం జరుగుతుందని, ఆర్డీఓలు కూడా వారి పరిధిలో సబ్ స్టేషన్లను తనిఖీ చేయాలని, వారం రోజుల్లోపు భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఏపీఎస్పీసీఎల్ పరిధిలో ఆల్ట్రా మెగా సోలార్ పార్క్ కోసం అవసరమైన భూమిని సేకరించాలన్నారు. గుంతకల్లు, సింగనమల, రాయదుర్గం నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల కోసం ఒక్కోచోట 50 ఎకరాల భూమిని గుర్తించాలని తహసీల్దారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Comments