కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
ఈ నెల 20న గచ్చిబౌలిలో ముఖ్యమంతి రేవంత్ రెడ్డి చేత శంకుస్దాపన
- రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికి స్టాంప్ప్ & రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టాం..ఈ సంస్కరణల వల్ల ప్రజలకు ఇప్పటికే పలు మెరుగైన సేవలు అందుతున్నాయి. భవిష్యత్తులో అత్యుత్తమ సేవలు అందించడానికి వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలనకు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరించి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మించబోతున్నాం. ఈ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండడంతో పాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది.
- మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకురాబోతున్నాం.. రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, గండిపేట, షేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్ నాలుగు ఆఫీసులను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంగా నిర్మిస్తున్నాం.. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఒక రోల్ మోడల్ గా తయారవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనానికి ఈనెల 20వ తేదీన శంకుస్ధాపన చేయనున్నారు. శంకుస్దాపనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం నాడు అధికారులతో సమీక్షించడం జరిగింది.
- అబ్దుల్లాపూర్, పెద్ద అంబర్ పేట్, హయత్‌నగర్, వనస్ధలిపురం నకు సంబంధించి కోహెడ్ లో,
- మహేశ్వరం, ఇబ్రహింపట్నం, శంషాబాద్‌కు సంబంధించి మహేశ్వరం మండలంలోని మంకాల్ లో,
- ఆర్వో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట్ కు సంబంధించి కండ్లకోయలో
- ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరికి సంబంధించి బోడుప్పల్ లో
- బంజారాహిల్స్, ఎస్.ఆర్. నగర్, గొల్కోండకు సంబంధించి బంజారాహిల్స్‌లో,
- ఆజంపూరా, చార్మినార్, దూద్‌బౌలి సంబంధించి మలక్‌పేటలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నాం.
- మరో పదమూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాల కోసం స్ధలాలను గుర్తించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
- ప్రజల సమయాన్ని ఆదా చేసే విధంగా పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించేలా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా అమలవుతుంది.
- రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి దశల వారీగా జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాం..ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల స్లాట్ బుకింగ్‌లు నమోదయ్యాయి.
Comments