సర్వే నివేదికల ఆధారంగా మాపై ఒత్తిళ్లు తేవడం తగదు!
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
సర్వే నివేదికల ఆధారంగా మాపై ఒత్తిళ్లు తేవడం తగదు!
- ప్రభుత్వం దయచేసి అర్థం చేసుకోవాలి
- 'దీపం-2' కింద ఇప్పటికే 2 కోట్ల సిలిండర్లు డోర్ డెలివరీ చేశాం
- ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి
విజయవాడ, ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'దీపం-2' పథకం కింద ఇప్పటి వరకు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేసినట్లు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వున్న 1200 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లంతా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ తమ అసోసియేషన్ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా చర్చించారని, ఈ సందర్భంగా తమ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని శ్రీనాథెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
'ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించడం, ఆ నివేదికల ఆధారంగా అన్ని జిల్లాల్లో అధికారులు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తెస్తుండటంతో మా వర్క్ ఫోర్స్ పై ప్రతికూల ప్రభావం పడుతోంది. జిల్లాల్లో అధికారుల ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ విధానం ఇబ్బందుల్లో పడే ప్రమాదం వుంది. అప్పుడు వినియోగదారులే స్వయంగా గోడౌన్ల వద్దకు, లేదా డెలివరీ ఆటోల వద్దకు వచ్చి సిలిండర్లను తీసుకువెళ్లాల్సి రావచ్చు. ప్రభుత్వం దయచేసి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి' అని ఆయన కోరారు. తమ సమస్యల పట్ల కమిషనర్ సానుకూలంగా స్పందించారని ప్రకటనలో శ్రీనాథ్ రెడ్డి వివరించారు.
Comments