రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే రహదారుల పాత్ర ప్రధానమైనది

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే రహదారుల పాత్ర ప్రధానమైనది

కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి. 

ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి పథంలో పయనించాలంటే రహదారుల పాత్ర ఎంతో ప్రధానమైనదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. జాతీయ రహదారుల ప్రారంభం, శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని సీకే కన్వేన్షన్ సెంటర్ లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడుతూ ముందుగా సభకు వచ్చిన వారికి అందరికి ధన్యవాదాలు అని తెలుగులో చెప్పిన సభికుల్లో ఆశ్చర్యచకితులను చేశారు. దేశ ప్రగతిలో రహదారుల పాత్రను ప్రస్తావిస్తూ జాన్ ఎఫ్ కెనడీ రోడ్లు మూలంగానే అమెరికా రిచ్ అయ్యింది అన్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు ఏపిని అభివ్రద్దిలో ముందుకు తీసుకువెళుతున్నారని, చంద్రబాబు తను సిఎంగా దేశానికి విజన్ చూపారని పేర్కొన్నారు. కన్ను ను దానం చెయ్యోచ్చు విజన్ ను చేయలేమని, భవిష్యత్తు పై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం, నాలెడ్జిని వెల్త్ గా మార్చేదే విజన్ అని వివరించారు. చంద్రబాబు డెవలెప్మెంట్ విజన్ పట్ల ఆయనను అభినందించాలన్నారు. కొత్త టెక్నాలజీ దేశాన్ని మార్చుతుంది. 

నేను షిప్పింగ్ మంత్రిగా ఉన్నప్పడు నా వద్ద 9వేల కోట్లు బడ్జెట్ ఉంటే 12 లక్షల కోట్లు పనులు చేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. పోర్టు ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివ్రుద్ది చెందుతాయని, బస్సు, రైలు కన్నా జలమార్గంలో చాలా ఖర్చు తగ్గుతుందన్నారు. ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ 16శాతం ఉంటే ఛైనా లో 8 శాతం అమెరికాలో 12 శాతం ఉందని, మనం 9 శాతం లాజిస్టిక్ కాస్టుకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఆరునెలలకు ముందు జపాన్ ను వెనెక్కి నెట్టి మనం ఆ స్ధానానికి ఎగబాకామని ఇది శుభసూచకమన్నారు. మన రైతులు కేవలం అన్నదాతే కాదు ఇంధన దాతలు అని, గతంలో ఇథనాల్ ను దేశీయ ఇంధనం లోకి తేవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గిందని, ఇదంతా రైతులు వల్లే సాధ్యాం అయ్యిందన్నారు. నేను ఏది చెపుతానో అది చేసి చూపూతా అందులో సందేహం లేదని పేర్కొన్నారు. ఇథనాల్ ను డీజిల్ లోనే కాదు ఎయిర్ ఫ్యూయల్ లో వినియోగించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. నేను ఎలక్టిక్ కార్ ను ప్రారంభించినప్పడు పాత్రికేయలు కారు ఆగిపోతే ఏం చేస్తారు అన్నారు మరి ఇప్పడు యాకంగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా వచ్చాయన్నారు. బ్యాటరీల తయారీలలో నూతన మార్గాలు వచ్చాయి అలాగే అయిదేళ్లలో బారత ఆటోమోబైల్ ఇండస్ట్రీ చాలా ముందుకు వెళుతుందన్నారు. ఏపిలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వస్తే రైతులకు లక్షల్లో ఆదాయం చేకూరే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్ధిక వ్రుద్దిలో 22శాతం వ్యవసాయం నుండి వస్తోందన్నారు. విజయవాడ -మచిలీపట్నం.....వినుకొండ- గుంటూరు...కోటప్పకొండ- గుంటూరు- నారాకోడూరు, ముదునూరు-కడప, హైదరాబాబ్ - విజయవాడ 6లేన్లు, హైదారాబాద్ నుండి విజయవాడ ను గ్రీన్ ఎక్స్రెస్ హైవే వస్తుంది దానివల్ల ప్రయాణ సమయం 2 గంటలకు పైగా ఆదా అవుతుందన్నారు. 


ఏపిలో లక్ష కోట్ల పనులు చేస్తాం, ఏపిలో రెండు నెలల్లోనే అమెరికా తో సమానంగా రోడ్లు తయారుఅవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి హామి ఇచ్చారు. నాగపూర్, జబల్ పూర్ మధ్య పశుగ్రాసం ను బిటమిన్ గా మార్చి కిలోమీటర్ రోడ్డు వేశామన్నారు. ఆ రహదారి పెట్రోలియం ప్రాడెక్టు తో వేసిన రోడ్డు కంటే బెటర్ అని నిపుణులు తేల్చారని తెలిపారు. రోడ్లు బాగా వేయాలనే భాద్యత ప్రధాని నాకు అప్పగించారన్నారు. నా వద్ద ఏపికి సంభందించి అతిపెద్ద లిస్టు ఉందని, వెబ్ సైట్లో వాటి వివరాలు(రోడ్లు ప్రాజెక్టు గురించి) ఉంచుతామన్నారు. రోడ్డు సేప్టికి సంభందించి శంకర్ మహదేవన్ గీతాన్ని విన్నాం రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపిలో కూడా యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కవగా నమోదు అవుతున్నాయని, ప్రతిజిల్లాలో వాటిని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం కు హెలికాప్టర్ లో వెళ్లినప్పడు ఎంతో నీరు సముద్రంలో కలిసిపోతుంది అని గుర్తించామన్నారు. గోదావరి నుండి కావేరి వరకూ నీటిని ఉపయోగించుకోవచ్చని, ఈ దేశంలో ఫుష్కలంగా నీరు ఉంది... నీటి వినియోగం సరిగా లేదన్నారు. 

అనంతరం 27 కోత్త ప్రాజెక్టులకు శంఖుస్ధాపన తో పాటు రెండు ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కారి, సిఎం, డిప్యూటీ సిఎంలు జాతికి అంకితం చేశారు. 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకి వెళ్లి ఇచ్చిన హమీని నేడు నిలబెట్టకున్నామన్నారు. ఏపి రాష్ట్ర అభివ్రుద్దికి మూలం అయిన రోడ్లు శంఖుస్ధాన చేయడం మరింత శుభదినంగా పేర్కొన్నారు. ఏపిలో కూటమి ఎప్పడు అధికారంలోకి వచ్చిందో నాటినుండి ఈ రాష్ట్రానికి శుభగడియలు వచ్చాయన్నారు. 2014లో 53 వేల కోట్లు బడ్జెట్ ఉంటే నేడు 6లక్షల కోట్లు వరకూ ఈ శాఖ బడ్జెట్ ను గడ్కారి తీసుకువెళ్ళారన్నారు. అయితే గత అయిదేళ్లలో రాజకీయ అసమర్ధత వల్ల రాష్ట్రం ఆ ఫలాలను పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కు కేంద్రం సాయంతో రూ. 12 వేల కోట్లకు పైగా కేటాయించారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి రూ. 11 వేల కోట్లు తెచ్చి విశాఖ ఉక్కును నిలబెట్టారని, అమరావతి రైతులు విధ్వంసకర పాలనలో కూడా సుదీర్ఘ కాలం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. 28 ప్రాజెక్టులపై ఇప్పడే రివ్వూ అయ్యింది. వాటికి ఖర్చు రూ. 80వేల కోట్లు వాటికి గడ్కరి నో అనకుండా ఎస్ అని వాటిని ఎలా పూర్తిచేయాలో చెప్పారన్నారు. పాజిటివ్, ప్రోయాక్టివ్ , ప్రాక్టికల్, పిస్ ఫుల్ మినిష్టర్ నితిన్ గడ్కారి అని కొనియాడారు. తొలిసారి మంత్రిగా భాద్యతలు స్వీకరించిన తనకు గడ్కరీ పనితీరు మార్గదర్శి గా నిలిచిందన్నారు. గత పది సంవత్సరాల్లో ఏవియేషన్ చూసిన గ్రోత్ అమోఘమన్నారు. ఎయిర్ క్రాప్ట్ ల సంఖ్య కూడా డబుల్ అయ్యిందని, ఏపిని వాయుమార్గం, జలమార్గం, రోడ్డు మార్గాల ద్వారా గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. 

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గడ్కరి కి నాలుగు విషయాల్లో మీకు దన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రోజుకు 30 నుండి 40 కిలో మీటర్లు మేర జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని, వైట్ కాంక్రిట్, రీసైకిల్ ప్లాస్టిక్ తో రోడ్లు నిర్మాణం మీ కృషి వల్లే జరిగిందన్నారు. రాజకీయాల్లోకి వస్తున్న మా లాంటి వారికి గడ్కరి ఆదర్శమని తెలిపారు. 140 మిటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇచ్చినందుకు ఈ ప్రాంతం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకు శంఖుస్ధాపన చేశారని, అలాగే 5000 ఎకరాలు సేకరణ చేసి అంతర్జీతీయ విమానాశ్రమం హైదరాబాద్ లో నిర్మింపచేశారని, హైదరాబాద్ లోని మెట్రో రైలుకు చంద్రబాబు నాయుడే శంఖుస్ధాపన చేశారని గుర్తు చేశారు. గత అయిదేళ్లు రాష్ట్రానికి ఎలాంటి పాలన అందించారో అందరూ చూశామన్నారు. చంద్రబాబు కొనసాగి ఉంటే ఈ పాటికి అమరావతి ముందుకు వెళ్లేదని ఈ ప్రాంతం అభివృద్ది అయ్యేదన్నారు. 

కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఏపిలో నేడు కీలకమయిన రోజని, .రైతుల ఖాతాల్లో నేరుగా అన్నదాత సుఖీభవ నగదు జమ అయిన రోజన్నారు. అర్హులైన ఫ్రతి ఒక్క రైతు ఖాతాల్లో 7వేల రూపాయాలు జమచేశామన్నారు. దేశంలో జాతీయ రహదారులు పేరు చెపితే గుర్తుకు వచ్చేది నితిన్ గడ్కారి అని కేంద్రమంత్రిగా భాద్యతలు చేపట్టాక జాతీయ రహదారుల రూపురేఖలను మార్చేశారన్నారు. రహదారులు విషయంలో కేంద్రంలో గడ్కారి, రాష్ట్రంలో చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారన్నారు. 11 సంవత్సరాల్లో దేశంలో 48వేల కిలోమీటర్ల జాతీయ రహదారి అభివ్రుద్ది జరిగింది అంటే దానికి కారణం గడ్కారి నే అని కొనియాడారు. అమెరికా అభివ్రుద్ది చెందింది కాబట్టి ఆ రహదారులు బావుంటాయి అంటారు అయితే రహదారులు భాగుంటాయి కాబట్టే ఆదేశం అభివ్రుద్ది చెందింది అని గడ్కారి నాతో అన్నారని గుర్తుచేసుకున్నారు. అమరావతి రాజధాని కోసం 140 మీటర్ల రోడ్ల కోసం సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారన్నారు.  


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మడమ తిప్పకుండా ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నారన్నారు. నాగరికతకు చిహ్నాలైన రహదారుల అభివృద్ధి పై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల రాష్ట్ర ముఖచిత్రం మారుతోందని తెలిపారు. అభివృద్ధికి పెద్ద పీట వేసే నాయకుడు ఓ వైపు ఉంటే..., రఫా రఫా భాషతో విధ్వేషాలు రెచ్చగొట్టే నాయకుడు మరోవైపు ఉన్నాడని ఎద్దేవ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నాయకత్వం ఓవైపు ఉంటే, యువతను చెడగొట్టి మంత్రుల్ని హత్య చేయిస్తాం అనే నాయకత్వం మరో వైపు ఉండటం దురదృష్టకరమని ఆవేధన వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-