నైపుణ్యం కలిగిన యువత కు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఎక్కువ
నైపుణ్యం కలిగిన యువత కు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఎక్కువ
• జర్మన్ లాంగ్వేజ్ పై పట్టు సాధిస్తే జర్మనీలో ఉపాధి పొందటం సులువు
• జర్మనీలో ప్రస్తుతం 7లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
• 2035 నాటికి అవి 70లక్షల ఉద్యోగాల ఖాళీలకు చేరుకుంటాయి
• రవాణా, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి
డా. బాల సుబ్రమణియన్ రమణి, జర్మనీలోని లోయర్ సాక్సోనీ రాష్ట్రం, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నైపుణ్య ఉద్యోగుల నియామక విభాగాధిపతి.
నైపుణ్యం కలిగిన యువత కొరత ప్రపంచదేశాలను వేధిస్తుందని, జర్మన్ దేశంలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జర్మనీలోని లోయర్ సాక్సోనీ రాష్ట్రం, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నైపుణ్య ఉద్యోగుల నియామక విభాగాధిపతి డా. బాల సుబ్రమణియన్ రమణి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు లోయర్ సాక్సోనీ రాష్ట్రం మధ్య నైపుణ్యాభివృద్ధి, జర్మన్ భాష శిక్షణ , ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సహకార అవకాశాలపై డా. బాల సుబ్రమణియన్ రమణి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బాల సుబ్రమణియన్ రమణి మాట్లాడుతూ జర్మనీలో ప్రస్తుతం 7 లక్షల పైగా ఉద్యోగ ఖాళీలు ఉండగా, 2035 నాటికి మరో 70 లక్షల నిపుణుల అవసరం ఉంటుందని అంచనావేశామన్నారు. రవాణా, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, ఇంజినీరింగ్, ఐటీ వంటి కీలక రంగాల్లో నైపుణ్య నిపుణుల కొరత ఉండనుందని వివరించారు. ఈ సమస్యకు పరిష్కారంగా జర్మనీ భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా గుర్తించిందని, 2024లో ప్రారంభించిన ఇండియా స్కిల్డ్ లేబర్ స్ట్రాటజీ మరియు వలస & గమనం భాగస్వామ్య ఒప్పందం ఈ సహకారానికి బలం చేకూర్చాయన్నారు. ఏపీ యువత నైపుణ్య విద్యతో పాటు జర్మన్ లాంగ్వేజీ పై పట్టు సాధించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ , హయ్యర్ ఎడ్యుకేషన్ , మరియు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగాల కార్యదర్శి కోన శశిధర్, ఓఎస్డీ ఆకుల వెంకట రమణ లతో సమావేశమై నైపుణ్య వలస మార్గదర్శకాలు, జర్మన్ భాషా శిక్షణ మరియు ధ్రువీకరణ, ఐటీఐలు మరియు పాలిటెక్నీక్ కళాశాలల భాగస్వామ్యం, ఇండస్ట్రీ -అకాడెమి భాగస్వామ్యాలు, విద్యార్థులు మరియు ఉద్యోగుల పరస్పర మార్పిడికి అవకాశాలు తదితర అంశాలపై చర్చించామని, గౌరవ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి యువత ఉపాధి అవకాశాలపై మాట్లాడామని వివరించారు. . అలాగే ఇండస్ట్రీ 4.0 & ఆటోమేషన్, గ్రీన్ టెక్నాలజీస్, హెల్త్ కేర్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ & ఐటీ, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ రంగాల్లో నిపుణులకు అధిక డిమాండ్ ఉందన్నారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ అండ్ సీఈఓ గణేష్ కుమార్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సీత శర్మలు మాట్లాడుతూ ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు లోయర్ సాక్సోనీ మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందానికి బలమైన పునాది పడిందని అలాగే ఆంధ్రప్రదేశ్ యువతకు నైపుణ్యాన్ని పెంపొందించడంలో, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడంలో, మరియు రెండు ప్రాంతాల మధ్య సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడంలో సహాయ సహకారాలు లభిస్తాయి అని తెలియజేసారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.