విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
- సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
- విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి
- పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం
- మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి
- తిరుపతిలో చెన్నారెడ్డి కాలనీ ఎస్సి బాలికల వసతి గృహంలో మంత్రి డా.స్వామి ఆకస్మిక తనిఖీ
తిరుపతి,ఆగస్టు 08
విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి అన్నారు. శుక్రవారం నాడు తిరుపతిలోని
చెన్నారెడ్డి కాలనీలో ఎస్సి బాలికల సంక్షేమ వసతి గృహంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహములోని వంటగది, మరుగుదొడ్లు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ.....సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రూ.143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేశాం. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి. పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమనిమంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.