రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అనంతలో రేపు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అనంతలో రేపు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం

అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

అనంతపురం, ఆగస్టు 19 :

  • ఈనెల 20వతేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న అనంతపురం నగరంలోని జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 20వతేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించడం జరుగుతుందన్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతపురం జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ నుంచి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా పరిశ్రమల యాజమాన్యాలు, తదితరులు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కోసం అన్ని రకాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ఆవిష్కరణ, స్టార్టప్‌లు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి సృష్టిని ప్రోత్సహించే లక్ష్యంతో, సిలికాన్ వ్యాలీ తరహా ఇకోసిస్టమ్‌ను సృష్టించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలతో పాటు అనంతపురం ఒక కీలక కేంద్రంగా ఎంపికైందన్నారు. ఈ సెంటర్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంటర్ వద్ద నాటిన మొక్కలను సంరక్షించాలని హార్టికల్చర్ డిడికి సూచించారు. సెంటర్ లో ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
  • ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, ఎన్ఐసి డిఐఓ రవిశంకర్, జిల్లా పరిశ్రమల శాఖ ఏడి రాజశేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ ఎస్ఈ చంద్రశేఖర్, ఆర్.అండ్.బి జెఈ బాల కాటమయ్య, ఎస్కే యూనివర్సిటీ అధికారి చంద్రమౌళి పాల్గొన్నారు.

Comments

-Advertisement-