హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితి శీతల ఎడారి యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ గుర్తింపు - భారత్లో 13వ రిజర్వ్..
హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితి శీతల ఎడారి యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ గుర్తింపు - భారత్లో 13వ రిజర్వ్..
హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఉన్న శీతల ఎడారి జీవావరణానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ ప్రాంతం 7,770 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
గుర్తింపు ఇచ్చింది: ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (UNESCO) దీనిని గుర్తించింది. ఈ గుర్తింపును పారిస్లో జరిగిన యునెస్కో 'మ్యాన్ అండ్ ది బయోస్పియర్' (MAB) అంతర్జాతీయ సమన్వయ సమితి యొక్క 37వ సమావేశంలో ప్రకటించారు.
గుర్తింపుతో ప్రయోజనాలు: యునెస్కో గుర్తింపు వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది, పర్యావరణ పరిరక్షణకు మరియు పరిశోధనలకు అంతర్జాతీయ సహకారం లభిస్తుంది.
భారతదేశం మరియు ప్రపంచ స్థితి:
శీతల ఎడారి (Cold Desert): శీతల ఎడారి అనేది వాతావరణం చాలా చల్లగా ఉండే ఒక రకమైన ఎడారి.
ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన ప్రదేశాలలో ఇటువంటి ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి.
యునెస్కో (UNESCO): యునెస్కో అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రత్యేక సంస్థ. ఇది విద్య, విజ్ఞానం, సంస్కృతి మరియు సమాచార రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
మ్యాన్ అండ్ ది బయోస్పియర్ (MAB): ఇది యునెస్కో ద్వారా 1971లో ప్రారంభించబడిన ఒక
అంతర్-ప్రభుత్వ శాస్త్రీయ కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం మానవులు మరియు పర్యావరణం మధ్య సంబంధాన్ని మెరుగుపరచడం. MAB కార్యక్రమం కింద గుర్తించిన ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్ అని పిలుస్తారు.
బయోస్ఫియర్ రిసర్వ్ (Biosphere reserve
ఇవి ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థలు. ఇక్కడ జీవవైవిధ్యాన్ని రక్షించడంతో పాటు, సహజ వనరుల సుస్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తారు.
బయోస్పియర్ రిజర్ను మూడు ప్రధాన విభాగాలుగా విభజిస్తారు:
1. కోర్ ఏరియా (Core Area): ఇక్కడ ఎటువంటి మానవ కార్యకలాపాలు అనుమతించబడవు.
2. బఫర్ జోన్ (Buffer Zone): ఇక్కడ పరిశోధనలు, విద్య మరియు పర్యాటకం వంటి కార్యకలాపాలు నిర్వహించవచ్చు.
3. ట్రాన్సిషన్ ఏరియా (Transition Area): ఇక్కడ మానవ నివాసాలు మరియు సుస్థిర ఆర్థిక
కార్యకలాపాలు ఉంటాయి.
భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన ఇతర ప్రాంతాలు
ఈ గుర్తింపుతో భారతదేశంలోని మొత్తం 13 సంరక్షణ ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరాయి.
1. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ (Nilgiri Biosphere Reserve): తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
2. నందా దేవి బయోస్పియర్ రిజర్వ్ (Nanda Devi Biosphere Reserve): ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది.
3. నొక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ (Nokrek Biosphere Reserve): మేఘాలయ రాష్ట్రంలో ఉంది.
4. సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ (Sundarbans Biosphere Reserve): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది.
5. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ (Gulf of Mannar Biosphere Reserve): తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
6. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ (Great Nicobar Biosphere Reserve): అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది.
7. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ (Simlipal Biosphere Reserve): ఒడిశా రాష్ట్రంలో ఉంది.
8. పచ్మర్తి బయోస్పియర్ రిజర్వ్ (Pachmarhi Biosphere Reserve): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
9.అచనక్మర్ అమకాంతక్ బయోస్ఫియర్(Achanakmar-Amarkantak Biosphere Reserve):
10. అగస్త్యమాలై బయోస్పియర్ రిజర్వ్ (Agasthyamalai Biosphere Reserve): కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
11. గ్రేట్ రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ (Great Rann of Kutch Biosphere Reserve): గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
12. కాంచెన్జంగా బయోస్పియర్ రిజర్వ్ (Khangchendzonga Biosphere Reserve): సిక్కిం రాష్ట్రంలో ఉంది.
13. శీతల ఎడారి జీవావరణం (Cold Desert Biosphere): హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఉంది.
