భారత్-భూటాన్ కొత్త రైల్వే ఒప్పందం: ₹4,033 కోట్లతో రెండు సరిహద్దు లైన్లు నిర్మాణానికి అంగీకారం...
భారత్-భూటాన్ కొత్త రైల్వే ఒప్పందం:
₹4,033 కోట్లతో రెండు సరిహద్దు లైన్లు నిర్మాణానికి అంగీకారం...
భారత్ మరియు భూటాన్ దేశాల మధ్య రెండు కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రాజెక్ట్ వ్యయం మొత్తం ₹4,033 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ప్రాజెక్టుల పూర్తి వ్యయాన్ని భారత ప్రభుత్వం భరించనుంది.
ప్రాజెక్ట్ వివరాలు:
మొదటి లైన్: పశ్చిమ బెంగాల్లోని బనారహాట్ నుండి భూటాన్లోని సమస్తే వరకు 20 కిలోమీటర్ల పొడవున ₹577 కోట్ల వ్యయంతో ఈ లైన్ ను నిర్మిస్తారు.
రెండో లైన్: అస్సాంలోని కోక్రాఝార్ నుండి భూటాన్ లోని గెలేపు వరకు 69 కిలోమీటర్ల పొడవున ₹3,456 కోట్ల వ్యయంతో ఈ లైన్ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రకటన: ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మరియు విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు.
ప్రయోజనాలు
- ఈ రైల్వే లైన్ల ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరియు పర్యాటకం గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఎక్కువ భాగం వ్యాపారం ఓడరేవుల ద్వారా జరుగుతోంది, రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే రవాణా వేగవంతం అవుతుంది.
భారత్ - భూటాన్ సంబంధాలు:
భారతదేశం మరియు భూటాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి.
భూటాన్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది.
సరిహద్దు వాణిజ్యం: రైల్వే లైన్ల నిర్మాణం సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
రైల్వే నెట్వర్క్(Railway Network):
రైల్వే నెట్వర్క్ అనేది ఒక దేశం లేదా ప్రాంతం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయం.
ఇది భారీ వస్తువుల రవాణాకు మరియు ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
బనారహాట్, కోక్రాజార్: ఇవి రెండు భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లు, ఇవి భూటాన్ అనుసంధానం
కానున్నాయి.
