రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

7న చంద్ర గ్రహణం

శ్రీవారి ఆలయం మూసివేత

సెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుండి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేత

తిరుమల, ఆగస్టు 31:

చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 12గం పాటు మూసివేయనున్నారు.

సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్‌ 8న సోమ‌వారం వేకువ‌జామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 

సెప్టంబ‌ర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.

సెప్టంబ‌ర్ 7న ఆర్జితసేవలు రద్దు

చంద్రగ్రహణం కారణంగా సెప్టంబ‌ర్ 7వ‌ తేదీ ఆదివారం ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

సెప్టంబ‌ర్ 7న‌ తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూత..

చంద్రగ్రహణం కారణంగా సెప్టంబ‌ర్ 7న ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదు. తిరిగి సెప్టంబ‌ర్ 8వ తేది ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 ల‌లో అన్నప్రసాదాల వితరణ ఉండదు.

భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుండి పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న వైభ‌వోత్స‌వ మండ‌పం, రామ్ భ‌గీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంట‌ర్లు, శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వ‌ద్ద‌ భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.

Comments

-Advertisement-