రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆరోగ్యానికి క్రీడలు అవసరం క్రీడలను ప్రోత్సహిస్తాం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updatesAp,news,TGnews, sports news
Mounikadesk

ఆరోగ్యానికి క్రీడలు అవసరం క్రీడలను ప్రోత్సహిస్తాం

జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను ప్రారంభించిన మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్

అనంతపురం సెప్టెంబర్ 21: అనంతపురం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురుస్వామి అధ్యక్షత వహించారు. సీనియర్ కోచ్ శాంతరాజ్, సీనియర్ క్రీడాకారులు, కోచ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ఆర్యోగ్యానికి క్రీడలు చాల అవసరమని క్రీడాకారులకు నిత్యం సాధన చేయాలని, గురువులు చెప్పినట్లుగా విని ఆటలో నైపుణ్యం పెంచుకోవాలని, క్రీడలను ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ప్రోత్సహిస్తుందని, చిన్నారులను క్రీడల్లో రాణించడానికి తల్లిదండ్రులు చూపిస్తున్న చొరవ వెలలేనిది అని కొనియాడారు. అనంతరం జిల్లా తైక్వాండో అసోసియేషన్ సభ్యులు మచ్చా రామలింగరెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు కేశవయ్య, మనీంద్ర, వెంకటేశులు, సాయి తేజ, అంజూమ్, సానియా, కృష్ణ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-