రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దేశంలోనే ప్రప్రధమంగా వాణిజ్య పంటల రైతులను ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమే

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

దేశంలోనే ప్రప్రధమంగా వాణిజ్య పంటల రైతులను ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమే

  • వాణిజ్య పంట రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు
  • యూరియా కూడా తగినంత ప్రమాణంలో రైతులు అందరికీ పంపిణీ చేస్తాము
  • రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు


అమరావతి, సెప్టెంబరు 2: దేశంలోనే ప్రప్రధమంగా వాణిజ్య పంట రైతులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుంది రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్యేకించి ఉల్లి రైతులు ఏమాత్రమూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధరను ప్రకటించి దాదాపు 580 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి అన్ని రైతు బజార్లలో విక్రయాలను చేయడం మొదలు పెట్టిందన్నారు. యూరియా విషయంలో కూడా రైతులు ఏమాత్రము ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగిన ప్రమాణంలో రైతులు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా యూరియా పంపిణీ, ఉల్లి పంట కొనుగోలు, అరకు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్ల నివారణపై సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది అదిక వర్షాల భయంతో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు 30 రోజుల ముందుగానే ఒకే సారి దాదాపు 5700 మెట్రిక్ టన్నుల ఉల్లిపంటను తీయడం వల్ల ధరలు పడిపోయాయని, ఈ సమస్యపై గత నెల 28 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించి కనీస మద్దతు ధరను కిలో రూ.12/- లను ప్రకటించి ఇప్పటి వరకూ దాదాపు 580 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఏ గ్రేడ్ తోపాటు లో గ్రేడ్ ఉల్లిని కూడా కొనుగోలు చేసి ఉల్లి రైతులను ఆదుకోవడం జరుగుచున్నదని, ఉల్లి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. 

అదే విధంగా యూరియా విషయంలో కూడా రైతులు ఏమాత్రము ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి విజ్ఞప్తి చేశారు. దాదాపు 22 లక్షల హెక్టార్లలో ఖరీప్ సాగు ప్రారంభమైందని మరియు బఫర్ స్టాక్ తో కలిపి 6.59 లక్షల టన్నుల యూరియా అందులో ఉందని, ఇప్పటివరకు 5.64 లక్షల టన్నుల యూరియా పంపిణీ జరిగిందన్నారు. గతంలో 50:50 రేషియాలో కేటాయించే విదానానికి బదులుగా మన రాష్ట్రానికి వచ్చే యూరియాలో 70 శాతం మార్కుఫెడ్ ద్వారా రైతులకు అందజేయాలని మిగిలిన 30 శాతం ప్రైవేటు డీలర్లకు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ విదానాన్ని అనుసరిస్తూ అన్ని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన యూరియాను తగిన ప్రమాణంలో పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 

అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, అయితే దాదాపు 20 ఎకరాల్లో అరకు కాఫీ తోటలకు కొత్తగా తెగులు సోకిందని, ఈ తెలుగు మరింత సోక కుండా ఈ పంటను వెంటనే నాశనం చేసి సంబందిత రైతులకు నష్టపరిహారాన్ని అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. 

అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మిర్చి, కోకో, నల్లబెర్లి, మామిడి తదితర వాణిజ్య పంటల విషయంలో కూడా ప్రభుత్వం కనీస మద్దతను ప్రకటించి ఆయా రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. మిర్చి పంట విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రితో మాట్లాడి మిర్చి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకూ దాదాపు రూ.54 కోట్లను నల్లబెర్లి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని, మరో రూ.59 కోట్లను జమచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను కూడా ఆదుకోవడం జరిగిందని, కోకో విషయంలో కూడా కేజీకి 50 పైసలు చొప్పున కొంత మేరకు రైతులకు సహాయం అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే అన్ని వర్గాలకు చెందిన రైతులను ఆదుకోవడం జరుగుతుంటే, ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతినిధులు అవగాహన లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ రైతుల విషయంలో మెసలికన్నీరు కారుస్తుందన్న విషయాన్ని రాష్ట్ర లోని రైతులు అందరూ గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

-Advertisement-