గిండి నేషనల్ పార్క్ (చెన్నై)లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి..
గిండి నేషనల్ పార్క్ (చెన్నై)లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి..
తమిళనాడులోని చెన్నైలో ఉన్న గిండి నేషనల్ పార్కులో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందిందని నిర్ధారించారు. జూన్ నెలలో పార్కులో మరియు పరిసర ప్రాంతాల్లో 12 పందులు మృతి చెందగా, వాటి నమూనాలను భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) కు పంపగా ఈ వ్యాధి నిర్ధారణ జరిగింది.
నిర్వారణ చర్యలు: వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అటవీ అధికారులు మరియు పశువైద్యులు పార్కులో సంచరించే పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారు.
1. ఆఫ్రికన్స్ స్వైన్ ఫీవర్ (AFRICAN SWINE FEVER - ASF)
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది ఒక అంటువ్యాధి (CONTAGIOUS VIRAL DISEASE).
వ్యాధి లక్షణాలు: ఇది పందులకు మాత్రమే సోకే, అత్యంత వేగంగా వ్యాపించే, ప్రాణాంతకమైన వైరల్ వ్యాధి. ఈ వ్యాధి సోకిన పందులకు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి టీకా లేదా చికిత్స అందుబాటులో లేదు.
వ్యాప్తి: ఈ వైరస్ ఒక పంది నుండి మరొక పందికి ప్రత్యక్ష సంపర్కం ద్వారా, లేదా కలుషితమైన ఆహారం, నీరు, వస్తువులు మరియు టిక్స్ వంటి వాహకాల ద్వారా వ్యాపిస్తుంది.
మానవులకు & ఇతర జంతువులకు ప్రమాదం: అధికారులు చెప్పినట్లుగా, ఈ వైరస్
నదులకు మాత్రమే పరిమితం. ఈ వైరస్ మానవులకు సోకదు (NON-ZOONOTIC). ఇది పార్క్ లోని ఇతర జంతువులకు (ఉదా: జింకలు, కోతులు) వ్యాపించదని నిర్ధారించారు.
ఆర్థిక ప్రభావం: పందుల పెంపకంపై ఆధారపడిన రైతులకు మరియు ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యాధి తీవ్ర నష్టం కలిగిస్తుంది.
2. జంతు వ్యాధులు మరియు పర్యావరణ వ్యవస్థ
వన్యప్రాణుల నిర్వహణ: జాతీయ పార్కులు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు
జంతువులకు వ్యాధులు రాకుండా నిరోధించడానికి మరియు వ్యాధులు సోకినప్పుడు వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి. వన్యప్రాణులలో వ్యాధులు వ్యాప్తి చెందడం పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు ముప్పు కలిగిస్తుంది.
నియంత్రణ చర్యలు: ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి ప్రభుత్వం మరియు వన్యప్రాణి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా సోకిన జంతువులను వేరు చేయడం లేదా చంపడం వంటివి ఉంటాయి.
3.గండి నేషనల్ పార్క్ (GUINDY NATIONAL PARK)
స్థానం: గిండి నేషనల్ పార్క్ చెన్నైలో ఉంది. ఇది నగరంలో ఉన్న ఒక అరుదైన జాతీయ పార్క్.
ప్రాముఖ్యత: ఇది భారతదేశంలో అతి చిన్న జాతీయ పార్కులలో ఒకటి. ఇక్కడ నల్ల దుప్పి (BLACKBUCK), మరియు అటవీ పందులు కూడా ఉన్నాయి, అవి ఈ వ్యాధికి గురయ్యాయి. ఇక్కడ బ్లాక్ బక్ జింకలు, మచ్చల జింకలు, నక్కలు, పాములు, అనేక రకాల పక్షులు మరియు పందులు ఉంటాయి.
పట్టణ వాతావరణం: ఒక నేషనల్ పార్క్ పట్టణ ప్రాంతంలో ఉండటం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతాయి. పందులు పార్క్ లోపల మరియు బయట తిరగడం వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది
జాతీయ పార్కు హోదా: ఒక ప్రాంతాన్ని జాతీయ పార్కుగా ప్రకటించడం, అక్కడ ఉన్న వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క పరిరక్షణకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటాయని సూచిస్తుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD):
పాత్ర: NIHSAD భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన జంతు వ్యాధులను అధ్యయనం చేసే ఒక ప్రత్యేక పరిశోధనా సంస్థ. ఇది భోపాల్లో ఉంది. ఈ సంస్థ జంతువులకు వచ్చే వ్యాధులను నిర్ధారించి, వాటిని నియంత్రించడానికి విధానాలను సూచిస్తుంది.
వ్యాధి నిఘా (DISEASE SURVEILLANCE): ఈ సంస్థ ఈవ్యాధుల వ్యాప్తిని నిరంతరం
పర్యవేక్షిస్తుంది. గిండి పార్స్లో పందుల నమూనాలను ఇక్కడకు పంపడం అనేది జంతువుల ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఎంత చురుగ్గా ఉందో సూచిస్తుంది.
