రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల చట్టాలపై దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల చట్టాలపై దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలి

  • ఆరోగ్య బీమా పథకాలలో వయస్సు పరిమితి తొలగించాలి
  • వృద్ధ మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పించి సులభ వడ్డీతో రుణాలు ఇవ్వాలి
  • డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్ధాలపై పాఠశాలలు, కళాశాలల స్థాయిల్లో విద్యార్థులకు పాఠ్యాంశం ప్రవేశపెట్టాలి
  • మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి
  • వికసిత్ భారత్‌పై కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్
  • వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి డోలా  బాలవీరాంజనేయస్వామి


అమరావతి, సెప్టెంబర్ 11 

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ అధ్యక్షతన వికసిత్ భారత్ 2027 వీడియో కాన్ఫరెన్స్ సమావేశం గురువారం జరిగింది. వెలగపూడి సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా  బాల వీరాంజనేయస్వామి స్వామి పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో మంత్రి స్వామి ఈ క్రింది అంశాలు ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల చట్టాలపై దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలి. ఆరోగ్య బీమా పథకాలలో వయస్సు పరిమితి తొలగించాలి, వయో వందన హెల్త్ ఇన్సూరెన్స్ అర్హత వయస్సును 70 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించాలి.మహిళా వృద్ధులకు ప్రత్యేక రాయితీలు కల్పించి సులభ వడ్డీతో రుణాలు ఇవ్వాలి.

డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్ధాలపై పాఠశాలలు, కళాశాలల స్థాయిల్లో విద్యార్థులకు పాఠ్యాంశం ప్రవేశపెట్టాలి.డీ-అడిక్షన్ సెంటర్ల సిబ్బందికి వేతనాలు నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బందితో సమానంగా పెంచాలి. పాఠశాలలు, కళాశాలల్లో జెండర్ సెన్సిటైజేషన్ మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలి.విద్య, ఉపాధి, వ్యాపారరంగంలో ట్రాన్స్‌జెండర్స్ కి సహాయం అందించాలని మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి సమావేశంలో సూచించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమశాఖ మంత్రులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-