"సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణల అమలు "
"సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణల అమలు "
ఇరవై సూత్రాల కార్యక్రమల అమలు ఛైర్మన్ లంకా దినకర్
56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వచ్చేలా 4 కేటగిరీలు 5%, 12%, 18% మరియు 28% నుండి వ 2 కేటగిరీలు 5% మరియు 18%కి GST రేట్లను పునర్వ్యవస్థికటించడం ద్వారా జీఎస్టీ సంస్కరణలను అమలు చేసినందుకు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సానుకూల తీర్మానం చేసిన దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన తర్వాత, దేశంలోని 90% కుటుంబాలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు మరియు సేవలపై వారి రోజువారీ జీవన వ్యయం తగ్గి వారి పొదుపు పెరుగుతున్న శుభసందర్భంగా దేశ ప్రజలు దసరా మరియు దీపావళి పండుగలకు ముందే దాబుల్ దమాకా మూడ్‌లో ఉన్నారు.
సంస్కరణల వల్ల జీఎస్టీ నుండి పూర్తి వెసులుబాటుతో జీవిత మరియు ఆరోగ్య బీమా ఖర్చు నుండి భారీ మొత్తంలో పొదుపు సాధ్యమవుతుంది, ఆహారం, ప్రాణాలను రక్షించే మందులు మరియు వైద్య పరికరాలు సున్నా లేదా 5%కి తగ్గించబడ్డాయి, పాఠశాల పిల్లలకు విద్యకు అవసరమైన పుస్తకాలు మరియు ఇతర అవసరాల కోసం సున్నా లేదా 5%కి తగ్గించబడ్డాయి,
వ్యవసాయ అవసరాల కోసం ట్రాక్టర్లు మరియు నిర్మాణ అవసరాల కోసం సిమెంట్ ప్రస్తుత 28% నుండి 18కి తగ్గించబడ్డాయి, 1500 CC కంటే తక్కువ ఉన్న వాహనాల ధరలు కూడా తక్కువ జీఎస్టీ కారణంగా బాగా తగ్గుతున్నాయి. ఈ తగ్గిన ధరలకు సంబంధించిన లాభం వినియోగదారులకు అందే విధంగా విషయ పరిజ్ఞాన్ని చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ద్వారా మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజలకు చేర్చే ప్రక్రియకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం సులభతర వాణిజ్యం కోసం ఊతం ఇస్తూ జీఎస్టీ సంస్కరణలతో మన దేశంలోని సామాన్యులకు ప్రయోజనం చేకూర్చడం మరియు సరసమైన ధరకు అవసరమైన వస్తువులు మరియు సేవలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం.
