ఆర్డీటీ సంస్థను నిలబెట్టడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం....
ఆర్డీటీ సంస్థను నిలబెట్టడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం....
- ఆర్డీటీ రెన్యూవల్ విషయం త్వరలోనే ప్రధాని దృష్టికి
- మంత్రి నారా లోకేష్ చొరవతో ఆర్డీటీ రెన్యూవల్ సాధిస్తాం
- ఎం.ఎస్.రాజు, మడకశిర ఎమ్మెల్యే
- ఏపీ సచివాలయం/వెలగపూడి:
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సంస్థకు అన్ని విధాలా అండగా నిలబడి, ఆ సంస్థను నిలబెట్టడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఉమ్మడి అనంతపురంజిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.....
ఆర్డీటీ సంస్థ ఉమ్మడి అనంతపురంజిల్లాకు ఒక వరం. దాదాపు 4వేల గ్రామాల్లో సేవలు అందిస్తోంది. 70వేల ఇళ్లు పేదలకు నిర్మించి ఇచ్చింది. అనంతపురంజిల్లాను హార్టీకల్చర్ హబ్ గా మార్చిన ఘనత ఆర్డీటీ సంస్థది. పేదవారి పిల్లలను దేశవిదేశాలు, ఇతర రాష్ట్రాల్లో చదివిస్తోంది. 600పడకల ఆసుపత్రిని పెట్టి బత్తలపల్లి, కనేకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం, రాయలసీమలోని ఇతర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందిస్తోంది. ఎఫ్.సీ.ఆర్.ఐ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే గత ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేసింది. నేడు ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆర్డీటీకి ఎఫ్.సీ.ఆర్.ఐ రెన్యూవల్ సాధించి ఆ సంస్థను నిలబెట్టేవరకు మేం ప్రభుత్వం నుండి కృషి చేస్తాం. మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఆర్డీటీకి ఎఫ్.సీ.ఆర్.ఐ రెన్యూవల్ చేపిస్తాం. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ గారు ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం. రెన్యూవల్ వచ్చే వరకు మేం ఆర్డీటీకీ అండగా నిలుస్తాం. అనంతపురంజిల్లా ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు...మేం ఆర్డీటీ సంస్థను నిలబెట్టడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఆర్డీటీని నిలబెట్టడం కూటమి ప్రభుత్వం బాధ్యత అని మంత్రి నారా లోకేష్ గారు జిల్లా ప్రజలకు చెప్పాలని చెప్పారు. ఖచ్చితంగా ఆర్డీటీ సంస్థను కాపాడుకుంటాం.
