MEPMAకి ప్రతిష్ఠాత్మక SKOCH ప్లాటినం అవార్డు
MEPMAకి ప్రతిష్ఠాత్మక SKOCH ప్లాటినం అవార్డు
ఢిల్లీ (20.09.2025): పట్టణ పేదరిక నిర్మూలన లో భాగంగా విశిష్ట సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన MEPMAకి ప్రతిష్ఠాత్మక SKOCH ప్లాటినం అవార్డు లు ఈరోజు ప్రదానం చేసిన SKOCH బృందం
మిషన్ డైరెక్టర్, మెప్మా, ఆంధ్రప్రదేశ్, ఎన్. తేజ్ భారత్, ఐ.ఏ.ఎస్. న్యూఢిల్లీ లోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో ప్రఖ్యాత స్కోచ్ ప్లాటినం అవార్డును ఈరోజు స్వీకరించారు.
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ లో భాగంగా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ దయనందిక సమీక్షలు, మార్గదర్శకత్వం లో, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఐఏఎస్ పర్యవేక్షణలో MEPMA సంస్థ 9 అవార్డులు పొందటం గర్వకారణం. ఈరోజు ఢిల్లీ లోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లో మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ IAS స్కోచ్ ప్లాటినం అవార్డును స్వీకరించారు... ఈ సందర్భంగా మెప్మా సంస్థ పట్టణ పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వినూత్న పధకాలకు దేశవ్యాప్తంగా మాదిరిగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ SKOCH ప్లాటినం అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచింది. పట్టణ అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న మార్గాలను ఇది దేశానికి చాటిచెప్పింది.
పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం (MEPMA), మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ IAS దూరదృష్టితో, పట్టణ పేదరిక నివారణలో చేసిన అసాధారణ కృషికి గాను ప్రతిష్ఠాత్మకమైన SKOCH ప్లాటినం అవార్డును అందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ సముదాయాల్లో ధ్రువీకరితమైన మార్పును తీసుకొచ్చిన MEPMA యొక్క వినూత్న, ప్రభావవంతమైన కార్యక్రమాలను ఈ గౌరవం గుర్తించింది. ఇవి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి.
SKOCH ఈ క్రింది మార్గదర్శక కార్యక్రమాల సమిష్టి ప్రభావాన్ని గుర్తించి అవార్డు ప్రదానం చేసింది:
1. నివాసం: పట్టణ నిరాశ్రయులకు సురక్షితమైన నివాస వసతి కల్పన.
2. లైవ్లీహుడ్ ట్రాకర్: జీవనోపాధుల పర్యవేక్షణ కోసం సాంకేతికత వినియోగం.
3. బ్యాంక్ లింకేజ్ స్కీమ్: స్వయం సహాయ సంఘాలను బ్యాంక్ లింకేజి ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం.
4. SHG మహిళలకు ఈ-కామర్స్ ద్వారా సాధికారత: SHG మహిళల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెట్ అవకాశాలు కల్పించడం.
5. నైపుణ్య మరియు గిగ్ ఎకానమీ ద్వారా SHG సాధికారత: SHGsను గిగ్ ఎకానమీతో అనుసంధానించడం ద్వారా నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు.
6. SHG ఆధారిత ఎంటర్‌ప్రైజ్‌లు మరియు పట్టణ ఉపాధి: SHGలను వ్యవసాయ రంగంలో భాగస్వాములుగా మార్చడం.
7. ప్రేరణ సఖీలు: ఆదర్శంగా నిలిచిన SHG మహిళా ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించడం.
8. స్ట్రీట్ వెండర్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్: వీధి విక్రేతల జీవనోపాధి మరియు సంక్షేమానికి మద్దతు.
9. బలహీన వృత్తుల సంఘటనం: వల్నరబుల్ వృత్తుల్లో ఉన్న కార్మికులను సంఘటితం చేసి సాధికారత కల్పించడం.
ఈ సందర్భంగా MEPMA మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ IAS మాట్లాడుతూ, ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, MEPMA బృందం, మరియు పట్టణ స్వయం సహాయక సంఘాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు MEPMA యొక్క పట్టణ పేదరిక నిర్మూలన దిశగా సాగుతున్న సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
