సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శ్రమిస్తోంది..
సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శ్రమిస్తోంది..
- సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం..
- మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం: అక్టోబరు 01, 2025
సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శ్రమిస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం మంత్రి నగరంలోని రహదారులు భవనాల అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా పింఛన్లు, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ నిర్వహణ సహా హమీలన్నీ పక్కాగా అమలు చేసి సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. మెగా డీఎస్సీతో దాదాపు 16 వేల ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం ద్వారా రోడ్లకు మరమ్మతులు చేపట్టామని, దీనితోపాటు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు ఇస్తూ ఆర్థిక భద్రత కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సమన్వయంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. జిల్లా, పార్లమెంటు, నియోజకవర్గం, మండలం యూనిట్‌గా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో విజయవాడ రహదారి అభివృద్ధికి చర్యలు చేపట్టామని, మూడు స్తంభాల సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు 80 అడుగులకు విస్తరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద రూ.13 కోట్లతో గతంలో ఆగిపోయిన పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ సహా అనేక ప్రాజెక్టులు పూర్తి కాబోతున్నాయన్నారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్, కర్నూలు ఇండస్ట్రియల్ పార్క్ పూర్తి చేస్తామని, 2047 నాటికి దేశంలోనే అగ్రస్థాయి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడం కోసం కూటమి ప్రభుత్వం కష్టబడి పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
