రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యూఢిల్లీ, నవంబర్‌ 5 (పీపుల్స్ మోటివేషన్ ):

నవంబర్ 1 కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో, ఇగాస్-బగ్వాల్ సందర్భంగా ఉత్తరా ఖండ్ లోని బ్యాంకులకు నవంబర్‌ 1న సెలవు. నవంబర్ 2 ఆదివారం. ఇక నవంబర్ 5 బుధవారం గురునానక్ జయంతి, కార్తిక పూర్ణిమ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు. నవంబర్ 7న వంగల పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు నవంబర్‌ 7న సెలవు. నవంబర్ 8న కనకదాస జయంతి, రెండో శనివారం సందర్భంగా కర్ణాటక సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. నవంబర్ 9 ఆదివారం. నవంబర్ 11న లహాబ్ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు హాలీ డే. నవంబర్ 16 ఆదివారం సెలవు. నవంబర్ 22 నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. నవంబర్ 23 ఆదివారం సెలవు. నవంబర్ 25న గురు తేజ్ బహదూర్ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హరియాణా, చండీగఢ్లలో బ్యాంకులకు సెలవు. నవంబర్ 30న ఆదివారం సెలవు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. సో.. బ్యాంకులకు వెళ్లకుండానే మీ ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.

Comments

-Advertisement-