రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

8న రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

8న రాష్ట్ర పండుగగా భక్త కనకదాస జయంతి
టెక్స్ టైల్స్’ లో 9 ఎంవోయూలు

—రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : ఈ నెల ఎనిమిదో తేదీన భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలని ఆ ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొనట్లు మంత్రి సవిత వెల్లడించారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతులపైనా, కుల వ్యవస్థపైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాస చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. అటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందకరమన్నారు. గతేడాది అనంతపురంలో భక్త కనకదాస రాష్ట్ర స్థాయి జయింతిని నిర్వహించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.

Comments

-Advertisement-