లండన్‌లో రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి
లండన్‌లో రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి
లండన్: 04 నవంబర్ 2025 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి నేడు లండన్‌లో ఒకే వేదికపై రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలు స్వీకరించనున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఆధ్వర్యంలో మే ఫెయిర్ హాల్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా సామాజిక సేవ, ప్రజా సంక్షేమానికి అందించిన సేవలకు గుర్తింపుగా ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025’ అవార్డు నారా భువనేశ్వరికి ప్రదానం చేయనున్నారు. అదే కార్యక్రమంలో, హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉత్తమ కార్పొరేట్ పాలన, పారదర్శక వ్యవస్థలు, నైతిక వ్యాపార ప్రమాణాలు అమలు చేసినందుకు గాను ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు కూడా ఆమె స్వీకరించనున్నారు. యూకే సమయానుసారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఎఫ్‌ఎంసీజీ రంగానికి ఆదర్శంగా నిలిచిన హెరిటేజ్ ఫుడ్స్‌ను ఎంపిక చేసినట్లు ఐఓడీ తెలిపింది. ఒకే రోజు, ఒకే వేదికపై సామాజిక సేవకు, వ్యాపార విశిష్టతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం అరుదైన గౌరవం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
