సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన..
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన..
ఘటన చాలా బాధాకరం.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
వారి ఆత్మ శాంతించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష
సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాద ఘటన చాలా బాధాకరమని మృతుల కుటుంబాలకు హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష అన్నారు. హసన్ భాష ఆధ్వర్యంలో మృతి చెందిన వారి ఆత్మకు సంతాపంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. సోమవారం నాడు పత్రికా ప్రకటన ద్వారా హసన్ భాష తెలుపుతూ ఇవాళ(సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు - ట్యాంకర్ ఢీకొన్న ఈ ఘటనలో 42 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు కాగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. బదర్ - మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువమంది తెలంగాణ వారు ఉన్నారు.అయితే, ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, ఫరూక్ లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది.. మృతులు: రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీగా గుర్తించారు. సౌదీ బస్సు ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలకు చెందిన 15 మంది మృతి చెందారు.ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు మృతిచెందగా, షోయబ్ ప్రాణాలతో బయటపడ్డారు. సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం +91 79979 59754, +91 99129 19545 ఈ నెంబర్లలలో సంప్రదించాలని సూచించారు.
