భారత రత్న, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందేశం
భారత రత్న, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందేశం
భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి మహోత్సవంలో పాల్గొన్న భారత రత్న సచిన్ టెండూల్కర్ బాబా పట్ల తనకున్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని, దివ్యానుభూతులను ఎంతో హృదయపూర్వకంగా పంచుకున్నారు. ఆయన సందేశం భక్తులను కదిలించేలా, బాబా మహిమను ప్రతీ హృదయంలో మళ్లీ ముద్రించేలాగా నిలిచింది.
“సత్యసాయి బాబాకు నా ప్రణామాలు. ఆయన నాకు చిన్నతనం నుంచే ఒక దైవసంబంధం లాంటి అనుభూతిని ఇచ్చార”ని తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పారు
"నాకు ఐదేళ్ల వయసులో ఉండగా ఎక్కడికైనా వెళ్లినా ‘ఈ బాలుడు బాల సత్యసాయి బాబాలా ఉన్నాడు’ అని అందరూ చెప్పేవారు. ఆ మాటలు అప్పట్లో వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, తరువాత బాబాతో ఏర్పడిన అనుబంధం ఆ మాటలకు అర్థం చూపింది.”
1990లలో వైట్‌ఫీల్డ్‌లో భగవాన్ సత్యసాయి బాబా దర్శనం పొందిన సందర్భాన్ని సచిన్ ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ "మనం అడగకపోయినా మన మనసులో ఏముందో, ఏ సందేహం వుందో బాబా ముందుగానే చెప్పేవారు. ఇది నమ్మశక్యం కాకపోయినా… నేను అనుభవించిన సత్యం.” శారీరక, మానసిక ఆరోగ్యంపై బాబా ఇచ్చిన బోధనలు తన జీవితాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు.
2011 వరల్డ్ కప్‌కు సంబంధించిన తమ జీవితంలో మరచిపోలేని ఘట్టాన్ని ఆయన పంచుకున్నారు. “ఆ వరల్డ్ కప్ సమయంలో అపారమైన అంచనాలు, ఒత్తిడి ఉండేవి. బెంగళూరులో మా క్యాంప్ జరుగుతున్నప్పుడు బాబా ఫోన్ చేసి, ఒక పుస్తకం పంపించానని చెప్పారు. ఆ పుస్తకం నాలో అనూహ్యమైన విశ్వాసాన్ని రగల్చింద.” ని సచిన్ అత్యంత భావోద్వేగంతో గుర్తుచేశారు.
“2011లో ముంబైలో ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్‌లో భారత జట్టు గెలిచి ట్రోఫీ అందుకున్నప్పుడు… అది నా జీవితంలో గోల్డెన్ మూమెంట్. అనుభవం చెప్పింది — ఇది బాబా ఆశీస్సుల వల్లే సాధ్యమైంది.” ఆ విజయంతో బాబా తనకు అంతర్గత శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రసాదించారని తెలిపారు.“బాబా మన వెంట ఉంటే భయం అనే మాటనే ఉండదు. ఆయనను స్మరించడం ఒక ఆశీర్వాదం.”
ఈ శతజయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఒక గొప్ప సత్కారం, అదృష్టం, ఆధ్యాత్మిక అనుభూతి అని “బాబా ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉన్నాయి… మమ్మల్ని నడిపిస్తున్నాయి.”సచిన్ తెలిపారు.
