రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గో మాంసం అక్రమ రవాణా ముఠాల మూలాలు గుర్తించండి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గో మాంసం అక్రమ రవాణా ముఠాల మూలాలు గుర్తించండి
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

• విశాఖ గో మాంసం అక్రమ నిల్వల వెనుక ఎవరున్నా వదలొద్దు

• మిత్ర గోడౌన్లో గో మాంసం పట్టుబడిన కేసుపై విశాఖ పోలీస్ కమిషనర్ ని ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ 

విశాఖ గో మాంసం అక్రమ నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  విశాఖ పోలీసులకు సూచించారు. గో మాంసం నిల్వల వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని తెలిపారు. విశాఖలో భారీగా గో మాంసం నిల్వలు పట్టుబడిన వ్యవహారంపై ఆరా తీశారు. విశాఖ పోలీస్ కమిషర్ నుంచి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గో మాంసం ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారు? ఎక్కడి నుంచి తెచ్చారు.. నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశాలపై  పవన్ కళ్యాణ్  విచారించారు. 

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి.ఆర్.ఐ) అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని పట్టుకుని, కేసును పోలీస్ శాఖకు అప్పగించినట్టు కమిషనర్  పవన్ కళ్యాణ్ కి తెలిపారు. డి.ఆర్.ఐ అధికారులు దాడులు జరిపిన సందర్భంలో అక్కడ ఉన్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అక్రమ రవాణా నెట్ వర్క్ ఎంత మేర విస్తరించి ఉంది? అనుమతుల ఉల్లంఘనలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్టు కమిషనర్ తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

-Advertisement-