రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మామిడి రైతులను ఆదుకోండి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మామిడి రైతులను ఆదుకోండి 

  • రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  • పల్స్ కంపెనీల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని పోయి పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది
  • చిత్తూరు ఎంపీ దుగ్గిరాల రాంప్రసాద్
  • జిల్లాలో రైతులకు మామిడి పంటను పండించిన రైతులకు ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ మేర 147 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది
  • జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

చిత్తూరు, నవంబర్ 17:
మామిడి రైతులను ఆదుకోండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మరియుచిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి  మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి 

పేర్కొన్నారు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందుజిల్లా కలెక్టర్ ‌ సుమిత్ కుమార్  అధ్యక్షతనమామిడి పండ్ల పరిశ్రమల యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి  మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

చిత్తూరు పార్లమెంటు సభ్యులు  దగ్గుమళ్ళ ప్రసాదరావు , పూతలపట్టు ఎమ్మెల్యే  మురళీ మోహన్ ,

మామిడి పండ్ల పరిశ్రమల యజమానులు, అధికారులు.. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నాడని తెలిపారుకే జి మామిడి కి రూ.4 మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లా మామిడి పంటను పండించిన రైతులకు ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ మేర 183 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది తెలిపారుఇందులో భాగంగా జిల్లాలో పరిస్థితులను వ్యవసాయ శాఖ మంత్రి పర్యవేక్షించగా, క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారన్నారు. తాను కూడా జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నానన్నారు. గతంలో మామిడి పంట దిగుబడి అధికంగా ఉండడంతో డిమాండ్ తగ్గి రైతులకు ఆశించిన ధర రాలేదన్నారు. ధర లేని కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశ్యం తో గిట్టుబాటు ధరగా రాష్ట్ర ప్రభుత్వం కేజి మామిడికి రూ.4 మద్దతు ధర ప్రకటించగా, ప్రొసెసింగ్ యూనిట్లు రూ.8 చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందుకు చిత్తూరు జిల్లాలోని రైతులకు 31,929 మంది రైతులకు కే.జి మామిడికి రూ.4 సబ్సిడీ చొప్పున మొత్తం రూ.146.84 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందన్నారు. ప్రొసెసింగ్ యూనిట్లు రైతుల క్షేమాన్ని గుర్తుంచుకుని, వారి పట్ల ధాతృత్వంతో ధరలు చెల్లించాలన్నారు. ప్రోత్సాహకాలు, వసతులు కల్పించి పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శర వేగంగా ముందడుగు వేస్తున్నదన్నారు. జిల్లాలో గుజ్జు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, విద్యుత్ ఛార్జీ సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన మద్ధతు ధర విషయంలో నిర్ణీత సమయంను నిర్దేశించుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యంకు సూచించారు.  

ఎంపి మాట్లాడుతూ గుజ్జు పరిశ్రమ రైతుల ఉత్పత్తుల పై ఆధారపడి ఉందని, రైతులు సైతం పరిశ్రమల పై ఆధార పడి ఉన్నారన్నారు. గుజ్జు పరిశ్రమలు, మామిడి రైతులు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. మామిడి రైతుల ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 సబ్సిడీ ప్రకటించి. పరిశ్రమల నుండి ఎంత ధర రైతులకు మీరు చెల్లిస్తారో సమగ్ర వివరాలు, ఏ తేదీలలో చెల్లిస్తారు సమగ్రంగా వివరణ ఇవ్వాలని పల్స్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు, ప్రభుత్వం సబ్సిడీ నాలుగు రూపాయలు మంజూరు చేసింది.

గుజ్జు పరిశ్రమలు మద్ధతు ధరలు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నదన్నారు. మద్ధతు ధరలు చెల్లించడం ఇబ్బంది గా ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు చెల్లించదగ్గ వీలైనంత త్వరగా ధరను జిల్లా కలెక్టర్ కుప్రతిపాదించాలన్నారు. రైతు కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు సూచించాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో 2.40 లక్షల మెట్రిక్ ల మామిడిని జూన్, జూలై మాసాలలో రైతుల నుండి గుజ్జు పరిశ్రమలకు సమీకరించడం జరిగిందన్నారు. జూలై నెల మధ్యలో మామిడి మార్కెట్ లో ధర పెరిగి రైతులకు మంచి ధరలు వచ్చాయన్నారు. జిల్లాలో కొన్ని గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లిస్తున్న మద్ధతు ధరలు తమిళనాడు కృష్ణగిరిలో చెల్లిస్తున్న దానికంటే తక్కువగా ఉండడం గమనార్హం అన్నారు. మద్ధతు ధర విషయంలో గుజ్జు పరిశ్రమలు, రైతులు పరస్పర సహకారం తో మాత్రమే అభివృద్ధి చెందాలన్నారు. పల్స్ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ యూరోపియన్ దేశాలలో దిగుమతి సుంకాలు ఎక్కువ అవ్వడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారు. మ్యాంగో పల్స్ పై విధిస్తున్న జిఎస్టిని తగ్గించాలి, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతినిధులు వివరించారు ఈ కార్యక్రమం లో ఉద్యాన శాఖ డిడి మధుసూదన్ రెడ్డి, పల్స్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-