రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్ధం..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

యాషెస్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్ధం..
General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యూఢిల్లీ, నవంబర్‌ 5 (పీపుల్స్ మోటివేషన్):నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న యాషెస్ 2025 తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా.. స్టీవ్ స్మిత్ సారథిగా ఎంపికయ్యాడు. అనూహ్యంగా యువ ఆటగాడు వెదరాల్డ్‌కు సైతం జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఇంగ్లాండ్.. రెండు నెలల క్రితమే జట్టును ప్రకటించింది.ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి ప్లేసులో స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా ఎవరూ ఊహించని ఆటగాడికి చోటు కల్పించింది. ఇటీవల ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మోత మోగించిన జేక్ వెదరాల్డ్‌ను జట్టులోకి తీసుకుంది. ఇదే సమయంలో మార్నస్ లబుషేన్‌కు సైతం తిరిగి జట్టులో చోటు కల్పించింది.నవంబర్ 21 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్‌ పెర్త్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌గా ఉస్మాన్ ఖవాజాకు ఒక ప్లేస్ ఖరారైంది. మరో స్థానంలో కోసం వెదరాల్డ్.. సీనియర్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరు ఖవాజాతో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఇక కమిన్స్ గైర్హాజరీలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌.. బ్యాకప్ పేసర్లుగా జట్టులోకి వచ్చారు. పేస్ ఆల్‌రౌండర్ల కోటాలో కామెరూన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్‌ను ఎంపిక చేశారు. పేలవ ఫామ్‌ కారణంగా యువ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌కు చోటు దక్కలేదు. మ్యాట్ రెన్‌షాకు సైతం నిరాశే ఎదురైంది. ప్రధాన పేసర్లుగా జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ తుది జట్టులో ఉండటం ఖాయమే. వారితో పాటు నాథన్ లైయాన్ ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులోకి వస్తాడు.యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, బ్రెండన్ డాగెట్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లైయాన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్

Comments

-Advertisement-