అంగన్వాడీ కేంద్రం పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
అంగన్వాడీ కేంద్రం పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమా ను విధుల నుండి తొలగించాలని ఆదేశం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, డిసెంబర్ 03 (పీపుల్స్ మోటివేషన్):-
కోడుమూరు మండలం అంగన్వాడీ కేంద్రం పని తీరు పట్ల జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమా ను విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఐసీడీఎస్ పిడి విజయను ఆదేశించారు..
బుధవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ , పిల్లలకు అందిస్తున్న పాలు, గుడ్లు తదితర పదార్థాలను, రిజిస్టర్ లను పరిశీలించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ రిజిస్టర్లను పరిశీలించి, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పదార్థాల స్టాక్ కు, రిజిస్టర్ లకు పొంతన కుదరకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ లో 1309 గుడ్లు స్టాక్ ఉన్నాయని, మిగిలినవి గర్భవతులకు పంపిణీ చేసినట్లు ఉండగా, ఫిజికల్ గా కేంద్రంలో 1584 గుడ్లు ఉన్నాయని గుర్తించారు. గత నెల 3 వ వారం, 4 వ వారం లో వచ్చిన గుడ్లను పూర్తి స్థాయిలో టేక్ హోమ్ రేషన్ కింద గర్భిణి, బాలింతలకు పంపిణీ చేయకుండా ఎందుకు అలాగే నిల్వ ఉంచారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ ను ప్రశ్నించారు.. టేక్ హోమ్ రేషన్ రిజిస్టర్ కూడా సక్రమంగా మెయింటైన్ చేయకుండా ఉన్నారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ పని తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు...అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలిస్తూ, పిల్లలు హాజరుకానప్పటికీ 100 శాతం అటెండెన్స్ వేశారని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రీ స్కూల్ కిట్స్ ను చూసి, వాటిని వాడనట్లు కలెక్టర్ గుర్తించారు. పిల్లలు యాక్టివ్ గా లేరని కనీసం ఏ, బి, సి, లు కూడా చెప్పలేకపోతున్నారని, పిల్లలకు ఏమి పాఠాలు నేర్పిస్తున్నారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ ను ప్రశ్నించారు.. పిల్లలతో ఏమీ రాయించకుండా పిల్లలకి ఏమి పాఠాలు చెప్తున్నారని కలెక్టర్ అంగన్వాడీ టీచర్ పని తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు..
వయస్సు కు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలు ఎంత మంది ఉన్నారని, సంబంధిత రిజిస్టర్ చూపించాలని కలెక్టర్ అంగన్వాడి టీచర్ ను ఆదేశించగా, సంబంధిత రిజిస్టర్ మెయింటైన్ చేయకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు... సక్రమంగా విధులను నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమా ను విధుల నుండి తొలగించాలని కలెక్టర్ ఐసీడీఎస్ పిడి విజయను ఆదేశించారు..
అంగన్వాడి సూపర్వైజర్ లు వెరిఫై చేయకుండా ఏమి చేస్తున్నారని అంగన్వాడి సూపర్వైజర్ కి నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు..అంగన్వాడి కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ వైద్యశాలలను తహసిల్దార్ లు, ఎంపిడిఓ లు ఖచ్చితంగా సందర్శించాలని కలెక్టర్ ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపిడిఓ లను ఆదేశించారు...
కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, తహసిల్దార్ నాగరాజు, సిడిపిఓ వరలక్ష్మి, సూపర్వైజర్, ఎంపిడిఓ తదితరులు పాల్గొన్నారు.

